బ్రషింగ్‌ ఎలా చేయాలో ఇటో లుక్కేయండి!

20 Mar, 2021 02:50 IST|Sakshi

పళ్లను శుభ్రపరచుకోవడంలో భాగంగా బ్రష్‌ చేసే సమయంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు చేస్తుంటారు. నిజానికి ఒక క్రమపద్ధతిలో బ్రషింగ్‌ సాగాలి. దంతాలు దెబ్బతినకుండా ఆరోగ్యకరమైన రీతిలో బ్రషింగ్‌ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి. 
►పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్‌ చేసుకోండి. ఇలా చేసుకునే సమయంలో నిలువుగా బ్రష్‌ చేస్తూనే పళ్ల మీద బ్రష్‌ కదలికలు సున్నాలు చుడుతున్నట్లుగా గుండ్రంగా సాగాలి. 
►మృదువుగా బ్రష్‌ చేసుకోండి. రఫ్‌గా బ్రష్‌ చేసుకుంటే అది మీ చిగుళ్లకు హాని చేకూర్చవచ్చు. అలాంటప్పుడు అవి త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. 
►మీ పంటికి బయటివైపే కాదు... లోపలి వైపునా బ్రష్‌ చేసుకోవాలి. నమిలే ప్రదేశాలల్లో పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ బ్రష్‌ చేసుకోవాలి. 
►రెండు లేదా మూడు నిమిషాల పాటు బ్రష్‌ చేసుకోవాలి. అంతకుమించి బ్రషింగ్‌ కూడా పళ్లకు మంచిది కాదు. 
►నాలుకపైనున్న బాక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్లపాటు స్క్రబ్‌ చేయండి. 
►చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్‌ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
►మూడు నెలలకు ఓమారు లేదా బ్రిజిల్స్‌ వంగినట్లు, కనిపించినా బ్రష్‌ను వెంటనే మార్చండి. అలాగే జ్వరం వచ్చాక లేదా ఏదైనా జబ్బుబారిన పడి కోలుకున్న వెంటనే బ్రష్‌ మార్చడం ఉత్తమం.   

మరిన్ని వార్తలు