ప్రోస్టేట్ పెరిగితే?
Prostate Gland Enlargement Causes Symptoms How It Cured Explained In Telugu: పురుషుడిలో పునరుత్పత్తికి ప్రోస్టేట్ గ్రంథే కీలకం. అదే లేకపోతే సంతానమే లేదు. వృషణాలు వీర్యకణాలను ఉత్పత్తి చేస్తే... అవి తేలిగ్గా ఈదుతూ వెళ్లేందుకు అవసరమైన ద్రవాన్ని ప్రోస్టేట్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. వీర్యకణాలు అండాలను చేరుకునేవరకు నశించిపోకుండా... ప్రోటీన్లూ, ఎంజైములూ, గ్లూకోజూ, కాస్తంత కొవ్వుల సాయంతో కాపాడుతుంది ఈ ద్రవం.
అంతేకాదు... స్త్రీ శరీరంలో కాస్త ఆమ్లగుణం ఉండటం వల్ల... దాన్ని న్యూట్రలైజ్ చేసేలా ప్రోస్టేట్ ద్రవం కాస్తంత క్షారగుణం కలిగి ఉంటుంది. ఫలితంగా ద్రవంలోని క్షారగుణం స్త్రీ శరీరంలోని ఆమ్లగుణాన్ని తట్టుకుని మరీ వీర్యకణాలను బతికించి, ఎట్టకేలకు గమ్యానికి చేర్చి అండం పిండమయ్యేలా తోడ్పడుతుంది. కానీ చిత్రమేమిటంటే... బాదంకాయంత ఉండే ఈ గ్రంథి 50 ఏళ్ల వయసు దాటాక అమాంతం పెరిగిపోతుంది. అప్పుడు వచ్చే అనర్థాలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకోవలసిన చర్యలను తెలుసుకుందాం.
నడి వయసు దాటాక కొంతమందిలో అమాంతం సైజు పెరిగిపోయే ప్రోస్టేట్ సాధారణంగా 18–22 గ్రాముల బరువుంటుంది. ఈ ప్రోస్టేట్ గ్రంథి మధ్య నుంచే మూత్రం బయటకు వచ్చే నాళం ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వల్ల చాలామందిలో కనిపించే లక్షణమేమిటంటే... మూత్రపు సంచి (బ్లాడర్)లో మూత్రం పూర్తిగా నిండిపోతుంది. అయితే సైజు పెరిగిన ప్రోస్టేట్ గ్రంథి మూత్రనాళాన్ని నొక్కేయడంతో మూత్రం బయటకు వచ్చే దారి ఉండదు.
ఓ పక్క కడుపు ఉబ్బిపోయిన ఫీలింగ్‌తో ఒత్తుగా మూత్రం వస్తున్నట్లు అనిపించడం... మరో పక్క అది ఎంతకూ బయటకు రాకపోవడం ఇబ్బందిగా మారుతుంది. వెంటనే హాస్పిటల్‌కు చేరిస్తే.. తొలుత ఓ పైప్‌ను ప్రవేశపెట్టి డాక్టర్లు లోపలున్న మూత్రాన్ని ఖాళీ చేస్తారు. ఆ తర్వాత సైజు పెరిగిన ప్రోస్టేట్‌కు అవసరమైన చికిత్స అందిస్తారు.
ఎందుకిలా సైజుపెరుగుతుంది?
కొందరిలో ప్రోస్టేట్ గ్రంథి సైజు అమాంతం ఎందుకు పెరుగుతుందో ఇప్పటికీ తెలియరాలేదు. ఓ వయసు దాటాక వృషణాల్లోని కణాలూ, వాటి నిర్మాణంలో వచ్చే మార్పులతో పాటు అవి ఉత్పత్తి చేసే టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయుల మార్పుల వల్ల ఇలా జరుగుతుందన్నది వైద్యశాస్త్రవేత్తల విశ్లేషణ.
లక్షణాలు
ప్రోస్టేట్ పెరుగుదలలో రెండు విధాలైన లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది స్టోరేజీ... అంటే మూత్రం భర్తీ అవడం వల్ల కనిపించే లక్షణాలు. రెండోది వాయిడింగ్... అంటే మూత్రపు సంచి (బ్లాడర్) ఖాళీ కావడానికి సంబంధించిన లక్షణాలు.
స్టోరేజీ
∙రాత్రివేళలల్లో మామూలు కంటే ఎక్కువగా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుండటం.
∙పగటివేళల్లో కూడా చాలా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం.
∙మూత్రం ఏమాత్రం ఆపుకోలేకపోవడం. ∙మూత్రవిసర్జన విషయంలో ఎలాంటి నియంత్రణ లేకపోవడం.
వాయిడింగ్
మూత్రవిసర్జనలో ఇబ్బంది.
ధారళంగా కాకుండా... మూత్రపుధార చాలా మెల్లగా రావడం.
మూత్రపు సంచి (బ్లాడర్) ఖాళీ కావడానికి చాలా సమయం తీసుకోవడం.
మూత్రవిసర్జనలో నొప్పి.
మూత్రం ఎంతోకొంత లోపలే ఉండిపోవడం. ∙ఒక్కోసారి మూత్రపు ధారలో రక్తపు చారిక కనిపించడం (బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇది కని
పిస్తుంది).
ప్రోస్టేట్ సమస్యల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చికిత్స
ప్రోస్టెటైటిస్ : ప్రోస్టేట్ గ్రంథికి వచ్చే ఇన్ఫెక్షన్ను ప్రోస్టెటైటిస్ అంటారు. మిగతా ఇన్ఫెక్షన్ల లాగానే దీనికి యాంటిబయాటిక్స్‌తో చికిత్స చేస్తే పూర్తిగా తగ్గుతుంది. దీనికి సరైన యాంటిబయాటిక్స్‌తో కాస్త ఎక్కువ కాలం పాటు చికిత్స చేయాల్సి ఉంటుంది.
మూత్రం ఏమాత్రం ఆపుకోలేకపోవడం, మూత్రంలో ఎరుపు కనిపించడం, మూత్రధారలో రక్తపు చారిక, మూత్రం లోపలే ఉండిపోవడం, మాటిమాటికీ వచ్చే ఇన్ఫెక్షన్లూ, కిడ్నీ దెబ్బతినడం వంటి సమస్యలు మందులతో అదుపు కాకపోతే శస్త్రచికిత్స అవసరమవుతుంది.
ప్రోస్టేట్ పెరిగిన పరిమాణం, దాని ఆకృతి వంటి అంశాలను బట్టి వేర్వేరు రకాల ప్రక్రియలు అవసరమవుతాయి. వీటన్నింటిలో బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా సమస్య కోసం సాధారణంగా ‘ట్రాన్స్ యురెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్’ (టీయూఆర్‌పీ) అనే శస్త్రచికిత్స ప్రక్రియను అనుసరిస్తుంటారు.
మరికొందరిలో లేజర్ సహాయంతో ‘లేజర్ ప్రోస్టెక్టమీ’ చేస్తుంటారు. సంప్రదాయ శస్త్రచికిత్సతో పోలిస్తే... రక్తాన్ని పలచబార్చే మందులు వాడుతున్నవారికీ, ప్రోస్టేట్ సైజు మరీ విపరీతంగా పెరిగినవారికీ, గుండె సమస్యలున్నవారికీ లేజర్ సహాయంతో చేసే చికిత్స వల్ల ప్రయోజనాలుంటాయి.
పెరుగుదలలో రెండు రకాలు
ప్రోస్టేట్ పెరుగుదల రెండు రకాలుగా ఉంటుంది. కణాల్లో ఎలాంటి హానికరమైన మార్పు లేకుండా కేవలం సైజు పెరగడం అన్నది మొదటిది. దీన్ని ‘బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా’ అంటారు.
ఇక రెండోది ప్రమాదకరమైన పెరుగుదల. ఇందులో పెరుగుదల అన్నది క్యాన్సర్ కణాల వల్ల సంభవించి, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు దారితీస్తుంది.
సమస్య నిర్ధారణ ఇలా...
-డాక్టర్ శ్యామ్ వర్మ,
రోబోటిక్ / ల్యాపరోస్కోపిక్ అండ్ లేజర్ యూరాలజిస్ట్, హైదరాబాద్.