అయ్యో పాపం అబ్మాయి!

28 Jan, 2024 06:21 IST|Sakshi

‘ప్రేమా మజాకా!’  అని మరోసారి అనిపించే సంఘటన ఇది. పంజాబ్‌కు చెందిన ఆంగ్రేజ్‌ సింగ్, పరమ్‌జిత్‌ కౌర్‌ ప్రేమికులు. కౌర్‌ ‘బాబా ఫరీద్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌’ నిర్వహించే మల్టీ–పర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతుంది. అయితే తన ప్రియురాలు కష్టపడడాన్ని ఆంగ్రేజ్‌ సింగ్‌ తట్టుకోలేకపోయాడు.

‘నీ బదులు నేను ఎగ్జామ్‌ రాస్తాను. ఆ కష్టమేదో నేను పడతాను’ అంటూ రంగంలోకి దిగాడు. ఎగ్జామ్స్‌ ప్రిపరేషన్‌కు కష్టపడ్డాడో లేదో తెలియదుగానీ మీసాలు, గెడ్డాలు గీయించి, పెదాలకు లిపిస్టిక్‌ పూసి, సల్వర్‌ కమిజ్‌ వేసుకొని అచ్చం అమ్మాయిలాగే కనబడడానికి చాలానే కష్టపడ్డాడు. అయితే బయోమెట్రిక్‌ దగ్గర ఫింగర్‌ప్రింట్స్‌ ఫెయిల్‌ కావడంతో ఆంగ్రేజ్‌ సింగ్‌ పట్టుబడ్డాడు. దీంతో సోషల్‌ మీడియాలో ఆంగ్రేజ్‌సింగ్‌పై మీమ్సే మీమ్స్‌. అయ్యో పాపం అబ్మాయి!

whatsapp channel

మరిన్ని వార్తలు