వర్షం కురవని ఊరు ఒకటి ఉందని తెలుసా..?

10 Jul, 2022 16:16 IST|Sakshi

భూమిపై వర్షం కురువని ప్రదేశం ఒకటి ఉందన్న విషయం నమ్మశక్యంగా లేదా..? నమ్మశక్యంగా లేనప్పటికీ తప్పక నమ్మి తీరాల్సిందే. చిలీలోని అటకామా ఎడారిలో కలామా అనే పట్టణంలో ఇప్పటి వరకు చినుకు కురిసిన దాఖలాలే లేవు. ఆ ఊరిలో లక్షా ఇరవై వేల సంవత్సరాలుగా నదులన్నీ ఎండిపోయి ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మూడు మిలియన్‌ సంవత్సరాల కంటే ముందు నుంచే అటకామా ప్రాంతం ఎడారిగా ఉంది. ఈ ప్రాంతం భూమిపై అత్యంత పురాతన ఎడారిగా గుర్తింపు పొందింది. 

మరిన్ని వార్తలు