Best Footwear For Monsoon: టో బాలెట్‌ ఫ్లాట్స్‌ .. ప్లాస్టిక్‌ శాండల్స్‌.. వానాకాలంలో ఏ చెప్పులు బెస్ట్‌!

15 Jul, 2022 13:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చినుకులో పాద రక్షణ

పాదాలకు అనువుగా ఉండాలి. పారుతున్న నీళ్లలో జారకుండా ఉండాలి. తడిసినా పాడవకుండా ఉండాలి. పాదాలకు వేసే చెప్పులే అయినా కాలానుగుణంగా ఉండాలి. ఎటు తిరిగినా అందంగానూ ఉండాలి. ఆ ఎంపిక ఎప్పుడూ బెస్ట్‌ అనిపించాలి. 

వర్షాకాలంలో రెయిన్‌కోట్లు, గొడుగు ఎంత ముఖ్యమో  ఈ కాలం వేసుకోదగిన చెప్పులు కూడా అంతే ముఖ్యం. ఏవి ఈ సీజన్‌కి సరైనవో ఎంపిక చేసుకోవడం మరీ ముఖ్యం. 

రబ్బర్‌ షూస్, పీవీసీ షూస్‌ ఈ కాలానికి  అనువుగానే కాదు ఫ్యాషనబుల్‌గా పర్ఫెక్ట్‌గా అమరుతున్నాయి. వాటిలో .. ఫ్లిప్‌ ఫ్లాప్స్, స్లిప్‌–ఆన్‌ క్రాస్‌లైట్‌ శాండల్స్‌ వర్షాకాలానికి అనువైనవి.

స్లిప్‌–ఆన్‌లో హీల్స్‌ కూడా ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఈ సీజన్‌లో స్టైలిష్‌ కన్నా సౌకర్యవంతంగా అమరేవే చూడాలి. పాదాలను పట్టినట్టుగా ఉంటూనే వదలడానికి అనువుగా, ప్లాట్‌ నమూనాతో ఉండటం వీటి ప్రత్యేకత. ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.  

టో బాలెట్‌ ఫ్లాట్స్‌ 
కాలి మునివేళ్లను దగ్గరగా ఉంచుతూ పాదాలను రక్షణ కలిగిస్తాయి. రంధ్రాలు ఉండే ఈ ఫ్లాట్స్‌ స్టైలిష్‌గానూ ఉంటాయి. ఇండియన్, వెస్ట్రన్‌.. ఏ స్టైల్‌ దుస్తులకైనా బాగా నప్పుతాయి. కాలేజీ, ఆఫీస్‌ వేర్, క్యాజువల్‌ వేర్‌.. అన్నివేళలా ధరించడానికి అనువైనవి. బురద అంటినా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవచ్చు.

రబ్బరు లేదా  ప్లాస్టిక్‌ శాండల్స్‌ 
లెదర్‌ వాటిలా కనిపించే షూస్, శాండల్స్‌ కూడా మార్కెట్‌లో ఉన్నాయి. అయితే ఇవి రబ్బరు లేదా ప్లాస్టిక్‌తో తయారుచేసినవి. హై టాప్‌ రెయిన్‌ షూస్‌ అయితే గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం, ట్రావెలర్స్‌కు సూట్‌ అవుతాయి.

స్ట్రాప్‌ శాండల్స్‌ 
పాదాలు తడిగా ఉన్నప్పుడు చెప్పలు, ఫ్లిప్‌–ఫ్లాప్స్‌ జారిపోతాయి అనుకునేవారు స్ట్రాప్‌ ఉన్న శాండల్స్‌ లేదా స్ట్రాప్‌ చెప్పులు ఎంచుకోవచ్చు.  

బాలెరినా షూస్‌ 
రబ్బరు లేదా లైక్రా బాలెరినా బూట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే పాదాలను బురద నుంచి కాపాడతాయి.

 

హీల్స్‌ లేనివే ఎంపిక 
నీళ్లు, బురదతో నిండిన రోడ్ల మీద నడిచేటప్పుడు జారకుండా ఉండాలంటే పట్టీలు ఉన్నప్పటికీ హీల్స్‌ని మాత్రం ఎంపిక చేసుకోకపోవడమే ఉత్తమం. పేస్టెల్, నియాన్‌ షేడ్స్‌ గల శాండల్స్‌ ఈ సీజన్‌కి మరింత అందాన్ని తీసుకువస్తాయి.

చదవండి: Cyber Crime Prevention Tips: రుణం కోసం అడ్వాన్స్‌.. చెల్లిస్తున్నారా?! అయితే ప్రమాదంలో పడ్డట్లే! ఈ జాగ్రత్తలు పాటించండి! 
C- Section Wound Infection: సిజేరియన్‌.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా?

మరిన్ని వార్తలు