మాటే మంత్రమై...

24 Mar, 2023 05:36 IST|Sakshi

చిన్న వయసులో ఉన్నప్పుడు ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌)లో జరిగిన మ్యాజిక్‌ షోకు వెళ్లాడు రాజ్‌ షమని.మెజిషియన్‌ టోపి నుంచి కుందేలు పిల్లను బయటికి తీశాడు. మంత్రదండం నుంచి పూలవర్షం కురిపించాడు.ఈ అబ్బురాలను చూసి ‘మెజిషియన్‌ అయితే ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో కదా!’ అనుకున్నాడు రాజ్‌. పెద్దయ్యాక రాజ్‌ మెజిషియన్‌ కాలేదుగానీ ‘మాటల మాంత్రికుడు’ అయ్యాడు! సోషల్‌ మీడియా కంటెంట్‌ క్రియేటర్‌గా బోలెడు పేరు తెచ్చుకున్నాడు....

పదహారు సంవత్సరాల వయసులో ఇండోర్‌లో తండ్రి చేసే వ్యా పారానికి చేదోడువాదోడుగా ఉండేవాడు రాజ్‌ షమని. తండ్రితో పాటు డిష్‌ సోప్స్‌ అమ్మేవాడు. ‘కాలాన్ని కనిపెట్టుకొని ఉండాలి’ అనేది వ్యా పారసూత్రం. ఆ వయసులో అతడికి ఇది తెలుసో లేదోగానీ డిష్‌ సోప్‌ నుంచి ΄పౌ డర్‌కు, ΄పౌ డర్‌ నుంచి లిక్విడ్‌కు, డిష్‌వాషర్‌ జెల్‌కు బిజినెస్‌ను మార్చాడు.

అంతకు ముందు ఉండీ లేనట్లుగా ఉన్న వ్యా పారం కొత్త ఊపిరి పోసుకొని లాభాల బాటలో పరుగెత్తింది.రాజ్‌కు తన గురించి తాను తెలుసుకునేలా చేసింది. కొన్ని సంవత్సరాల తరువాత...సోషల్‌ మీడియాలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబైకి వచ్చాడు రాజ్‌.‘మరీ ఎక్కువగా ఉత్సాహపడుతున్నావు. ఇక్కడ బాగానే ఉంది కదా’ అన్నారు ఇండోర్‌ ఫ్రెండ్స్‌. అయితే రాజ్‌ షమని ఒక్క విజయం దగ్గర ఆగిపోయే టైప్‌ కాదు. ఉత్సాహమే అతని ఇంధనం.

కొన్ని సంవత్సరాల కష్టం తరువాత మన దేశంలోని మోస్ట్‌–ఫాలోవ్‌డ్‌ కంటెంట్‌ క్రియేటర్‌లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు రాజ్‌ షమని. మరో విశేషం...మన దేశంలోని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు సంబంధించిన పాడ్‌కాస్ట్‌లలో రాజ్‌ షమని చేసిన ‘ఫిగర్‌ ఔట్‌’ పాడ్‌కాస్ట్‌ టాప్‌లో నిలిచింది. పన్నెండు నెలల వ్యవధిలో 100 మిలియన్‌ వ్యూలు వచ్చాయి.తన స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఎంతోమంది స్టార్టప్‌ల వైపు రావడానికి కారణమైన రాజ్‌ తొమ్మిది స్టార్టప్‌లలో ఏంజెల్‌ ఇన్వెస్టర్‌గా ఉన్నాడు.

‘వినియోగదారుల ఇష్టాలపైనే వ్యా పారాన్ని నిర్మించాలి’ అని చెప్పే రాజ్‌ షమని డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌ తమ కన్జ్యూమర్‌ బ్రాండ్స్‌ను ఎస్టాబ్లిష్‌ చేసుకోవడం, విజయవంతం చేయడంలో సహాయపడే ‘హౌజ్‌ ఆఫ్‌ ఎక్స్‌’ వెంచర్‌ స్టార్ట్‌ చేశాడు. ఈ వెంచర్‌ ఇన్వెస్టర్‌ల జాబితాలో నితిన్‌ కామత్‌( జెరోదా–కో ఫౌండర్‌), వినీత సింగ్‌ (షుగర్‌ కాస్మెటిక్స్‌)లాంటి వ్యా పారదిగ్గజాలు ఉండడం విశేషం.

మోటివేషనల్‌ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు 26 సంవత్సరాల రాజ్‌ షమని.ఇప్పటివరకు ఇరవైకి పైగా దేశాల్లో స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఇచ్చిన రాజ్‌ షమని ‘బిల్డ్, డోన్ట్‌ టాక్‌’ పేరుతో వ్యక్తిత్వ వికాస పుస్తకం రాశాడు. ఈ పుస్తకం గురించి ఇలా పరిచయం చేసుకుంటాడు రాజ్‌...‘మన స్కూల్లో మ్యాథ్స్, సైన్స్‌లాంటి సబ్జెక్ట్‌లు తెలుసుకుంటాం. అయితే ఒక వస్తువును ఎలా అమ్మాలి? స్నేహసంబంధాలను ఏర్పర్చుకోవడం ఎలా? మానసిక ఆరోగ్యంపై ఎలా శ్రద్ధ చూపా లి? ఆర్థిక విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి....మొదలైన విషయాలు స్కూల్‌లో తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు.

అందుకే ఈ పుస్తకం బడిలోకి రండి. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు’ ‘హౌజ్‌ ఆఫ్‌ ఎక్స్‌’ ఇన్వెస్టర్‌లలో ఒకరైన నితిన్‌ కామత్‌ ఇలా అంటాడు...‘ఐడియాలు, ప్రో డక్ట్‌ ఎంత ముఖ్యమో వ్యక్తులు కూడా అంతే ముఖ్యం. సోషల్‌ మీడియాలో రాజ్‌ షమని సాధించిన విజయాలే మా నమ్మకానికి కారణం’ఒక్క విజయం దగ్గరే ఆగిపోయే అలవాటు లేని రాజ్‌ షమని, తన విజయాలకు మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదు. ఇతరులను కూడా గెలుపు బాటలో నడిపించాలనుకుంటున్నాడు.

మరిన్ని వార్తలు