Rajasthani Onion Kachori: రాజస్థానీ ఉల్లి కచోరీ

30 May, 2021 12:18 IST|Sakshi

కావలసినవి: మైదా పిండి – పావు కేజీ; వంట సోడా – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; కలోంజీ (ఉల్లి గింజలు) – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టీ స్పూన్లు; నూనె – ఒక టేబుల్‌ స్పూను; నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ధనియాలు – ఒక టీ స్పూను (బాగా నలపాలి); పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; ఇంగువ – కొద్దిగా; ఉల్లిపాయలు – అర కిలో (సన్నగా తరగాలి); ఉప్పు – తగినంత; చాట్‌ మసాలా – ఒక టీ స్పూను; కారం – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; బంగాళ దుంప – 1 (మీడియం సైజు); కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; నిమ్మ రసం – ఒక టీ స్పూను

తయారీ:

  • ముందుగా ఒక పాత్రలో మైదా పిండి, వంట సోడా, ఉప్పు, కలోంజీ, నెయ్యి వేసి బాగా కలపాలి 
  • తగినన్ని నీళ్లు జత చేస్తూ, సుమారు పది నిమిషాల పాటు పూరీ పిండిలా గట్టిగా కలపాలి 
  • ఒక టీ స్పూను నూనె వేసి మరోమారు బాగా కలిపి, పైన తడి వస్త్రం వేసి సుమారు అరగంట పక్కన ఉంచాలి 
  • బంగాళ దుంపను ఉడికించి, తొక్కు తీసి, చేతితో మెత్తగా మెదిపి పక్కన ఉంచుకోవాలి 
  • స్టౌ మీద బాణలిలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి బాగా కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి 
  • నలిపి ఉంచుకున్న ధనియాలు జత చేయాలి
     
  • పచ్చి మిర్చి తరుగు, ఇంగువ జత చేసి బాగా కలపాలి 
  • ఉల్లి తరుగు వేసి సుమారు పది నిమిషాల పాటు బంగారు రంగులోకి వచ్చేవర కు కలుపుతుండాలి 
  • ఉప్పు, చాట్‌ మసాలా, మిరప కారం, పసుపు, గరం మసాలా జత చేసి మరోమారు కలపాలి 
  • ఉడికించి ఉంచుకున్న బంగాళ దుంప ముద్ద జత చేసి మరోమారు కలియబెట్టాలి 
  • కొత్తిమీర తరుగు, నిమ్మ రసం జత చేసి కలిపి, దింపి చల్లారనివ్వాలి 
  • నానబెట్టి ఉంచుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన  ఉంచాలి 
  • ఉల్లి తరుగు మిశ్రమాన్ని కూడా ఉండలు చేసి పక్కన ఉంచాలి 
     
  • మైదా పిండి ఉండలను ఒక్కోటి చేతిలోకి తీసుకుని, కొద్దిగా వెడల్పుగా ఒత్తాలి 
  • ఉల్లి మిశ్రమం ఉండను మధ్యలో ఉంచి, అంచులు మూసేసి, చేతితో జాగ్రత్తగా కచోరీ మాదిరిగా ఒత్తాలి 
  • స్టౌ మీద బాణలిలో నూనె పోసి బాగా మరిగిన తరవాత, తయారుచేసి ఉంచుకున్న కచోరీలు వేసి, స్టౌ ఆర్పేయాలి మూడు నిమిషాల తరవాత కచోరీలు పైకి తేలుతున్న సమయంలో, స్టౌ వెలిగించి, కచోరీలను బాగా వేయించి, కిచెన్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి.  

    గ్రీన్‌ ఫిష్‌ కర్రీ.. ఇలా తయారీ!

మరిన్ని వార్తలు