Rare Dumbo Octopus Video: ఏనుగు చెవులు లాంటి అరుదైన ఆక్టోపస్‌! విస్తుపోయిన శాస్త్రవేత్తలు

25 Sep, 2023 15:24 IST|Sakshi

సముద్ర గర్భంలో లభించే ప్రతి ఒక్క జంతువు ఓ అద్భుతం అనే చెప్పాలి. ఇప్పటికీ ఏదో ఒక వింత వింత జలచరాలు కనిపిస్తూనే ఉంటాయి. సముద్ర గర్భంలో మనిషికి అంతుపట్టని ఎన్నో​ గమ్మత్తు విషయాలు చెబుతూనే ఉంటుంది. ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అచ్చం అలాంటి అరుదైన ఘటనే పసిఫిక్‌ మహాసముద్రంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే..ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రంలో అత్యంత అరుదైన డంబో ఆక్టోపస్‌ కనిపించింది.రిమోట్‌ పనిచేసే ఓషన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్ట్‌ వాహనంలో అమర్బడిన డీప్‌ సీ కెమెరా ఈ ఫోటోని తీసింది. ఈ అరుదైన ఆక్టోపస్‌ దాదాపు 7 వేల కిలోమీటర్ల లోతులో నివశిస్తుంది. వీటిని ప్రంపచంలోనే అందమైన ఆక్టోపస్‌లుగా పిలుస్తారట. ఈ ఆక్టోపస్‌లకి చెవులు "డంబో ది ఎలిఫెంట్‌" వలే ఉంటాయట.

అంటే చెవులు వలె కనిపించే రెక్కలు ఏనుగు చెవుల మాదిరిగా పెద్దగా ఉండటంతో అలా పిలుస్తారు. ప్రత్యేకమైన చెవిలాంటి రెక్కలతో కదులుతుంది. అందుకు సంబంధించిన వీడియోని ఓషన్‌ ఎక్స్‌ ప్లోరేషన్‌ ట్రస్ట్‌ యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసింది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది మీరు ఓ లుక్కేయండి.  

(చదవండి: 'అత్యంత స్వచ్ఛమైన గాలి' లభించేది ఇక్కడే..బాటిల్లో నింపి..)

మరిన్ని వార్తలు