పచ్చిపాల నిగారింపు 

7 Jul, 2022 07:12 IST|Sakshi

బ్యూటిప్‌ 

  • పచ్చిపాలు, రోజ్‌ వాటర్‌ను సమానంగా తీసుకుని చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్‌లై చేసి మర్దనా చేయాలి. పదినిమిషాల తరువాత కాటన్‌ బాల్‌తో తుడిచేయాలి. 
  • పచ్చిపాలలో చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ఈ పాలను ముఖానికి రాసి ఐదు నిమిషాలపాటు మర్దన చేసి చల్లటి నీటితో కడిగేయాలి. 
  • ఎండవేడికి పాడైన చర్మాన్ని సంరక్షించడంలో పచ్చిపాలు ప్రముఖపాత్ర పోషిస్తాయి. రోజూ క్రమం తప్పకుండా రెండుపూటలా పై రెండింటిలో ఏదైనా ఒక పద్దతిని అనుసరిస్తే ముఖానికి సహజ సిద్ధ నిగారింపు సంతరించుకుంటుంది.

మరిన్ని వార్తలు