Apple Pongal Recipe: పెసరపప్పు, నెయ్యి, జీడిపప్పు.. రుచికరమైన ఆపిల్‌ పొంగల్‌!

20 Jun, 2022 12:38 IST|Sakshi

ఆపిల్‌ పొంగల్‌ ఎప్పుడైనా టేస్ట్‌ చేశారా? ఇదిగో ఇంట్లో ఇలా సులభంగా వండుకోండి! కమ్మని రుచిని ఆస్వాదించండి.

ఆపిల్‌ పొంగల్‌ తయారీకి కావలసినవి:  
►పెసరపప్పు, బియ్యం – అర కప్పు చొప్పున (పది నిమిషాలు నానబెట్టి, నీళ్లు తొలగించి శుభ్రం చేసుకుని పక్కనపెట్టుకోవాలి)
►నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు
►జీడిపప్పు, కిస్మిస్‌ – గార్నిష్‌కి సరిపడా
►ఉప్పు – తగినంత
►ఆపిల్‌ – 2 (తొక్క,గింజలు తొలగించి ముక్కలు చేసుకోవాలి)
►బెల్లం పాకం – 1 కప్పు (అప్పటికప్పుడు సిద్ధం చేసుకుని, వడకట్టుకోవాలి)

ఆపిల్‌ పొంగల్‌ తయారీ విధానం:
►ముందుగా ఒక కుకర్‌ తీసుకుని.. అందులో నెయ్యి వేసుకుని జీడిపప్పు, కిస్మిస్‌ వేయించి పక్కన పెట్టుకోవాలి.
►అందులో బియ్యం వేసుకుని 1 నిమిషం గరిటెతో తిప్పుతూ వేయించాలి.
►తర్వాత పెసరపప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ మరో నిమిషం పాటు వేయించుకోవాలి.
►అనంతరం ఉప్పు, ఆపిల్‌ ముక్కలు వేసుకుని కలపాలి.
►ఆపై 2 కప్పుల నీళ్లు పోసి, కుకర్‌ మూత పెట్టి.. 3 లేదా 4 విజిల్స్‌ వచ్చేవరకు ఉంచి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.
►ఆవిరి చల్లారేంత వరకు ఆగి.. కుకర్‌ మూత తీసి.. మళ్లీ స్టవ్‌ ఆన్‌ చేసుకుని, కుకర్‌ స్టవ్‌ మీద పెట్టి, ఆ మిశ్రమాన్ని గరిటెతో బాగా తిపాల్పి.
►బెల్లం పాకం జోడించి మరింత సేపు ఉడికించుకోవాలి.
►చివరిగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌ వేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.
►వేడి వేడిగా ఉన్నప్పుడే నెయ్యితో కలిపి సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. 

చదవండి: Kullu Trout Fish: ఘుమఘుమలాడే కులు ట్రౌట్‌ ఫిష్‌ తయారీ ఇలా!

మరిన్ని వార్తలు