Senagapindi Masala Roti Recipe: హర్యానా స్టైల్‌.. శనగపిండి మసాలా రోటీ తయారీ ఇలా!

2 Jul, 2022 11:00 IST|Sakshi

హర్యానా స్టైల్‌.. నోరూరించే శనగపిండి మసాలా రోటీ తయారీ విధానం తెలుసుకుందాం!

శనగపిండి మసాలా రోటీ తయారీకి కావలసినవి:
►శనగపిండి – కప్పు
►గోధుమ పిండి – కప్పు
►పసుపు – అర టీస్పూను
►వాము – టీస్పూను
►ఉప్పు – టీస్పూను
►పెరుగు – అరకప్పు

మసాలా:
►కారం – అరటీస్పూను
►జీలకర్ర పొడి – అరటీస్పూను
►ధనియాలపొడి – అరటీస్పూను
►నెయ్యి – టేబుల్‌ స్పూను.

తయారీ..
►గోధుమపిండి, శనగపిండి, పసుపు, వాము, ఉప్పులను గిన్నెలో వేయాలి.
►దీనిలో పెరుగు అవసరాన్ని బట్టి నీళ్లు చల్లుకుని ముద్దలా కలుపుకోని ఇరవై నిమిషాలపాటు నానబెట్టుకోవాలి.
►మసాలా కోసం తీసుకున్న అన్ని పొడులు, నెయ్యిని గిన్నెలో వేసి చక్కగా కలపుకుని పక్కనపెట్టుకోవాలి.
►పిండిముద్దను ఉండలు చేయాలి.
►ఒక్కో ఉండను పిండి చల్లుకుంటూ గుండ్రని చపాతీలా వత్తుకోవాలి.
►ఈ చపాతీపై కలిపిపెట్టుకున్న మసాలా మిశ్రమం వేసి త్రికోణాకృతిలో మడతపెట్టి మరోసారి చక్కగా వత్తుకోవాలి.
►రోటీని రెండువైపులా నెయ్యి చల్లుకుంటూ చక్కగా కాల్చుకుంటే శనగపిండి మసాలా రోటీ రెడీ. 

ఇవి కూడా ట్రై చేయండి: Saag Chicken Recipe: హర్యానా వంటకం.. సాగ్‌ చికెన్‌ తయారీ ఇలా!

మరిన్ని వార్తలు