Chicken Strips Recipe: మైదా, బ్రెడ్‌ ముక్కల పొడి.. చికెన్‌ స్ట్రిప్స్‌ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

18 Jul, 2022 11:30 IST|Sakshi

చికెన్‌ స్ట్రిప్స్‌

చికెన్‌ స్ట్రిప్స్‌ ఇలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోండి!
చికెన్‌ స్ట్రిప్స్‌ తయారీకి కావలసినవి:
►స్కిన్, బోన్‌లెస్‌ చికెన్‌ బ్రెస్ట్‌ – కేజీ (పొడవాటి ముక్కలుగా తరగాలి)
►చీజ్‌ తురుము – కప్పు
►బ్రెడ్‌ ముక్కల పొడి – కప్పు
►కొత్తిమీర తరుగు – పావు కప్పు

►మైదా – కప్పు
►మిరియాల పొడి – రెండు టేబుల్‌ స్పూన్లు
►ఉప్పు – రుచికి సరిపడా
►గుడ్లు – మూడు
►నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా. 

చికెన్‌ స్ట్రిప్స్‌ తయారీ విధానం
►ఒక గిన్నెలో చీజ్, బ్రెడ్‌ ముక్కల పొడి, కొత్తిమీర తరుగు వేసి చక్కగా కలిపి పెట్టుకోవాలి.
►మరో గిన్నెలో గుడ్లను పగులగొట్టి సొనను బీట్‌ చేసి పెట్టుకోవాలి.
►మరో గిన్నె తీసుకుని మిరియాలపొడి, మైదా, రుచికి సరిపడా ఉప్పువేసి కలిపి పెట్టుకోవాలి.
►ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్‌ స్ట్రిప్స్‌ను ముందుగా గుడ్లసొనలో ముంచాలి.
►తరువాత మైదా మిశ్రమంలో ముంచాలి. మైదాలో ముంచి మరోసారి గుడ్లసొనలో ముంచాలి.
►చివరిగా చీజ్‌ మిశ్రమంలో ముంచి డీప్‌ఫ్రై చేయాలి.
►రెండు వైపులా గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంత వరకు ఫ్రైచేసి సర్వ్‌ చేసుకోవాలి. 

ఇవి కూడా ట్రై చేయండి: Fish Pakodi Recipe: నోటికి కాస్త కారంగా, క్రిస్పీగా.. ఇంట్లో ఇలా ఫిష్‌ పకోడి చేసుకోండి!
Sweet Potato Cutlet Recipe: చిలగడ దుంపతో తియ్యటి కట్‌లెట్‌..

మరిన్ని వార్తలు