Kobbari Vadalu Recipe: రుచికరమైన కొబ్బరి వడల తయారీ ఇలా!

15 Aug, 2022 14:36 IST|Sakshi

కొబ్బరి వడలు ఇలా తయారు చేసుకోండి.
కొబ్బరి వడల తయారీకి కావలసినవి:
►కొబ్బరి కోరు – అర కప్పు
►బియ్యం – 1 కప్పు (నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టాలి)
►జీలకర్ర – 1 టీ స్పూన్‌

►బియ్యప్పిండి – 1/3 కప్పు
►ఉప్పు  – తగినంత
►నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ:
►ముందుగా మిక్సీ బౌల్‌లో నానబెట్టిన బియ్యం, జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకోవాలి.
►అనంతరం అందులో కొబ్బరికోరు, ఉప్పు వేసుకుని.. ఈసారి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
►ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. దానిలో బియ్యప్పిండి వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి.
►అనంతరం ఒక అరటి ఆకుపైన లేదా మందంగా ఉండే ప్లాస్టిక్‌ కవర్‌ మీద చిన్నచిన్న ఉండల్ని అప్పడాల్లా ఒత్తుకుని.. కాగుతున్న నూనెలో దోరగా వేయించుకోవాలి.
►ఇవి నూనెలో పడగానే పూరీల్లా పొంగుతాయి. వేడి వేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. !

ఇవి కూడా ట్రై చేయండి: Kalakand Laddu Recipe: దాల్‌ బనానా ఖీర్‌, కలాకండ్‌ లడ్డూ తయారీ ఇలా!
Recipes: శాగూ కేసరి.. పన్నీర్‌ వైట్‌ గ్రేవీ ఇలా తయారు చేసుకోండి!

మరిన్ని వార్తలు