Pineapple Cake: ఈ పదార్థాలు ఉంటే చాలు.. పైనాపిల్‌ కేక్‌ రెడీ!

12 Apr, 2022 14:54 IST|Sakshi

పైనా‘పిల్‌’ను తింటే వేరుగా ఏ ‘పిల్‌’ తీసుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది చమత్కరిస్తూ ఉంటారు. దీనిని ఆరోగ్యాల ఆవాస కేంద్రం అని కూడా చెబుతుంటారు. పైనాపిల్‌ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అయితే, ఎప్పుడూ రొటీన్‌గా పైనాపిల్‌ ముక్కలు తినడం, జ్యూస్‌ తాగడం వంటివి కాకుండా ఇలా ఎంచక్కా కేక్‌ చేసుకుని తినండి!

పైనాపిల్‌ కేక్‌
కావలసినవి:  బ్రౌన్‌ సుగర్‌ పౌడర్‌ – 150 గ్రాములు
అన్‌ సాల్టెడ్‌ బటర్‌ – 175 గ్రాములు, పైనాపిల్‌ స్లైస్, చెర్రీస్‌ – 20 చొప్పున
మైదాపిండి – ఒకటిన్నర కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ – ఒకటిన్నర టీ స్పూన్లు
ఉప్పు – పావు టీ స్పూన్, పంచదార పొడి – అర కప్పు, గుడ్లు – 2
వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ – 1 టీ స్పూన్, సోర్‌ క్రీమ్, పాలు, పైనాపిల్‌ జ్యూస్‌ – పావు కప్పు చొప్పున

తయారీ: ముందుగా ఒక బౌల్‌లో 60 గ్రాముల కరిగించిన బటర్‌ వేసుకుని.. అందులో 100 గ్రాముల బ్రౌన్‌ సుగర్‌ పౌడర్‌ వేసుకుని బాగా కలిపాలి.
ఆ మిశ్రమాన్ని గుండ్రటి షేప్‌లో ఉండే కేక్‌ బౌల్‌లో అర అంగుళం మందంలో విస్తరించాలి.
దానిపైన గుండ్రటి పైనాపిల్‌ స్లైస్, చెర్రీతో డెకరేట్‌ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
అనంతరం పెద్ద బౌల్‌ తీసుకుని మైదాపిండి, బేకింగ్‌ పౌడర్, ఉప్పు వేసుకుని బాగా కలిపి ఉంచుకోవాలి.
ఈలోపు మరో బౌల్‌లో మిగిలిన బటర్, బ్రౌన్‌ సుగర్, పంచదార పొడి వేసుకుని హ్యాండ్‌ బ్లెండర్‌ సాయంతో క్రీమ్‌లా చేసుకోవాలి.
అందులో గుడ్లు పగలగొట్టి వేసుకుని మరింత మెత్తటి క్రీమ్‌లా చేసుకోవాలి.
మధ్యమధ్యలో మైదా–బేకింగ్‌ పౌడర్‌ మిశ్రమాన్ని వేసుకుంటూ.. సోర్‌ క్రీమ్, పాలు, పైనాపిల్‌ జ్యూస్‌ కొద్దికొద్దిగా వేసుకుంటూ హ్యాండ్‌ బ్లెండర్‌తో మిక్స్‌ చేసుకుంటూ ఉండాలి.
ఫ్రిజ్‌లో పెట్టుకున్న కేక్‌ మేకర్‌ బౌల్‌ తీసుకుని దాని నిండుగా ఈ మిశ్రమాన్ని వేసుకుని సమాంతరంగా చేసుకుని ఓవెన్‌లో బేక్‌ చేసుకోవాలి.
ఆ తర్వాత నచ్చిన విధంగా కలర్‌పుల్‌ క్రీమ్స్‌తో డెకరేట్‌ చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు