Potato Tornado: ఈ పదార్థాలు ఉంటే చాలు.. ఈజీ పొటాటో స్నాక్‌.. టేస్టు అదిరిపోద్ది!

5 Apr, 2022 14:30 IST|Sakshi

పొటాటో టోర్నడో

ఆలు చిప్స్‌ తినీతిని బోర్‌ కొట్టిందా! అయితే, బంగాళా దుంపతో ఈ వైరైటీ వంటకాన్ని ట్రై చేయండి. రొటీన్‌కు భిన్నంగా పొటాటో టోర్నడో రుచిని ఆస్వాదించండి.

పొటాటో టోర్నడో తయారీకి కావాల్సిన పదార్థాలు:
బంగాళ దుంపలు – 4 లేదా 5
మైదాపిండి – అర కప్పు
మొక్కజొన్నపిండి – 1 టేబుల్‌ స్పూన్‌
బేకింగ్‌ సోడా – అర టీ స్పూన్‌
ఉప్పు – కొద్దిగా, నీళ్లు – కావాల్సినన్ని
నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
గార్లిక్‌ పౌడర్‌ – 1 టేబుల్‌ స్పూన్‌
చీజ్‌ తురుము – 3 టేబుల్‌ స్పూన్లు
చీజ్‌ సాస్‌ – 4 టేబుల్‌ స్పూన్ల పైనే
డ్రై పార్సీ – అర టేబుల్‌ స్పూన్‌
ఎండు మిర్చి పొడి – 1 టేబుల్‌ స్పూన్‌

తయారీ: ముందుగా ఒక బౌల్‌లో గార్లిక్‌ పౌడర్, చీజ్‌ తురుము, డ్రై పార్సీ.. వేసుకుని బాగా మిక్స్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక్కో బంగాళదుంపను ఒక్కో పొడవాటి పుల్లకు గుచ్చి.. చాకుతో స్ప్రిల్స్‌లా (వలయంలా, మొత్తం కట్‌ చెయ్యకుండా చిత్రంలో ఉన్న విధంగా) కట్‌ చేసుకుని పెట్టుకోవాలి.
అనంతరం వెడల్పుగా ఉండే బౌల్‌లో మైదాపిండి, మొక్కజొన్నపిండి, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచటి మిశ్రమంలా చేసుకోవాలి.
ఆ మిశ్రమంలో ఒక్కో పొటాటో స్ప్రింగ్‌ని ముంచి.. నూనెలో దోరగా వేయించాలి. అనంతరం వాటిని వరుసగా పెట్టుకుని.. అటు ఇటు తిప్పుతూ గార్లిక్‌–చీజ్‌ మిశ్రమాన్ని చల్లుకోవాలి.
ఆ పైన చీజ్‌ సాస్‌ స్ప్రిల్స్‌ పొడవునా స్ప్రెడ్‌ చేసుకుని.. చివరిగా ఎండుమిర్చి పొడిని చల్లి.. సర్వ్‌ చేసుకోవాలి. 

చదవండి: Summer Drink: సుగంధ షర్బత్‌ ఎలా తయారు చేస్తారో తెలుసా?

>
మరిన్ని వార్తలు