Som Tam Salad In Telugu: వరల్డ్‌ ఫుడ్‌ థాయ్‌ సొమ్‌తమ్‌ తయారీ ఇలా!

18 Jun, 2022 13:47 IST|Sakshi

కావలసినవి: పచ్చిబొప్పాయి చిన్నది – ఒకటి, బీన్స్‌ – నాలుగు(సన్నగా తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – ఆరు, చెర్రీ టొమాటోలు – ఎనిమిది(ముక్కలు తరగాలి), పచ్చిమిర్చి (ఎర్ర లేదా పచ్చనివి) – ఆరు, పంచదార – రెండు టేబుల్‌ స్పూన్లు, నిమ్మరసం – మూడు టేబుల్‌ స్పూన్లు, సోయాసాస్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, వేయించిన వేరు శనగ గింజలు – మూడు టేబుల్‌ స్పూన్లు.

తయారీ..
∙ బొప్పాయి తొక్క, గింజలు తీసి సన్నగా తురుమి ఒక గిన్నెలో వేయాలి
∙ వెల్లుల్లి రెబ్బలు, బీన్స్, టొమాటోలు, పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచి పక్కనపెట్టుకోవాలి
∙ ఒక కప్పులో పంచదార, నిమ్మరసం, సోయా సాస్‌వేసి కలిపి పెట్టుకోవాలి
∙ ఇప్పుడు బొప్పాయి తరుగులో దంచిన ముక్కలు, పంచదార, సోయాసాస్‌ల మిశ్రమం వేసి చక్కగా కలుపుకుని సర్వ్‌ చేసుకోవాలి.

గమనిక: దంచాల్సిన వాటిని బ్లెండర్‌లో అస్సలు వేయకూడదు. సోయాసాస్‌లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేయనవసరం లేదు.

మరిన్ని వార్తలు