Green Peas Akki Roti: బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో.. గ్రీన్‌ పీస్‌ అక్కీ రోటీ తయారీ

28 Oct, 2022 10:08 IST|Sakshi

రోజూ రుచిగా తినాలి. కానీ... అద్దం నిండి పోతోంది. ఏం చేయాలి? మితిమీరిన బరువు వద్దు. వ్యాయామం మరీ ఎక్కువ చేయలేం!  మరేం చేయాలి?  బరువు తగ్గాలంటే... ఏం తినాలో చాలా మంది చెప్తారు. ఎలా వండాలో మేము చెప్తున్నాం. 

గ్రీన్‌ పీస్‌ అక్కీ రోటీ
కావలసినవి:
►బియ్యప్పిండి– కప్పు
►పచ్చి బఠాణీ– కప్పు
►ఉల్లిపాయ – 1(తరగాలి)
►కొత్తి మీర తరుగు– 3 టీ స్పూన్‌లు
►పచ్చిమిర్చి– 3 (తరగాలి)

►జీలకర్ర– టీ స్పూన్
►కరివేపాకు – 2 రెమ్మలు
►ఉప్పు – తగినంత
►నూనె– టీ స్పూన్‌

తయారీ:
►బఠాణీలను కడిగి ఉడికించి, నీటిని మరో పాత్రలోకి వంపి పక్కన ఉంచాలి.
►బఠాణీలను మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేయాలి.
►అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, బియ్యప్పిండి, జీలకర్ర, మిర్చి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.
►మిశ్రమం మరీ గట్టిగా అనిపిస్తే బఠాణీలు ఉడికించిన నీటిని తగినంత తీసుకుంటూ గారెల పిండిలా కలపాలి.

►అరిటాకు లేదా పాలిథిన్‌ పేపర్‌కు నూనె రాసి పై మిశ్రమాన్ని పెద్ద ఉల్లిపాయంత తీసుకుని సమంగా అరిశెలాగ వత్తాలి.
►మధ్యలో ఐదారు చోట్ల చిల్లు పెట్టాలి. పెనం మీద కొద్దిగా నూనె వేసి ఈ రోటీని పేపర్‌ మీద నుంచి జాగ్రత్తగా పెనం మీదకు జార్చాలి.
►మీడియం మంట మీద రెండు వైపులా కాల్చాలి.  

ఇవి కూడా ట్రై చేయండి: Paneer Halwa Recipe: కోవా, బెల్లం కోరు, డ్రై ఫ్రూట్స్‌.. నోరూరించే పన్నీర్‌ హల్వా తయారీ ఇలా
 ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు.. ఆవకాడో టోస్ట్‌, చిలగడ దుంప సూప్‌ తయారీ

మరిన్ని వార్తలు