Oats Walnut Cutlets: ఓట్స్‌– వాల్‌నట్స్‌ కట్లెట్‌ తయారీ ఇలా..

20 Dec, 2022 12:27 IST|Sakshi

ఓట్స్‌– వాల్‌నట్స్‌తో కట్లెట్‌ తయారు చేసుకోండిలా!
కావలసినవి:
►ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌ ముక్కలు – అర కప్పు
►ఓట్స్‌ – అర కప్పు (మిక్సీ పట్టి పొడిలా చేసుకోవాలి)
►పచ్చి బఠాణీలు – అర కప్పు (నానబెట్టాలి)
►కొత్తిమీర – అర కప్పు

►పచ్చిమిర్చి – 1
►వాల్‌నట్స్‌ – ఒక కప్పు
►బంగాళదుంపలు – 2 (ఉడికించి, ముద్దలా చేసుకోవాలి)
►అల్లం పేస్ట్, కారం, జీలకర్ర, పసుపు – 1 టీ స్పూన్‌ చొప్పున
►ఉప్పు – తగినంత
►నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ:
►ముందుగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్‌ ముక్కలు, పచ్చి బఠాణీలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వాల్‌నట్స్‌ అన్నీ మిక్సీ పట్టుకోవాలి.
►అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
►బంగాళదుంప గుజ్జు, అల్లం పేస్ట్, కారం, పసుపు, ఓట్స్‌ పౌడర్‌ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. తగినంత ఉప్పు కలుపుకోవాలి.
►అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు జోడించి ముద్దలా చేసుకుని.. చిన్న చిన్న కట్లెట్స్‌ తయారు చేసుకోవాలి.
►వాటిని నూనెలో దోరగా వేయించి వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే సరిపోతుంది.

ఇవి కూడా ట్రై చేయండి: జొన్న దోసె.. బరువు తగ్గాలనుకునే వారి కోసం..
రొటీన్‌గా కాకుండా.. ఇలా ఓట్స్‌ మసాలా దోసెలు ట్రై చేయండి!

మరిన్ని వార్తలు