Udupi Sambar: రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉడిపి సాంబార్‌ తయారీ ఇలా

4 Feb, 2023 10:25 IST|Sakshi

రుచికరమైన, ఆరోగ్యకరమైన ఉడిపి సాంబార్‌ తయారు చేసుకోండిలా!
కావలసినవి:
►కందిపప్పు – అరకప్పు (కడిగి అరగంటసేపు నానబెట్టాలి)
►పసుపు– అర టీ స్పూన్‌
►ఉప్పు– రుచికి తగినంత
►బీరకాయ ముక్కలు– 300 గ్రాములు
►టొమాటో ముక్కలు – కప్పు.

సాంబార్‌ పేస్ట్‌ కోసం:
►మినప్పప్పు– టేబుల్‌ స్పూన్‌
►గుంటూరు మిర్చి– 8
►పొట్టి మిరపకాయలు – 6
►ధనియాలు – 2 టేబుల్‌ స్పూన్‌లు

►యాలకులు – 2
►లవంగాలు – 3
►దాల్చిన చెక్క– అంగుళం ముక్క
►జీలకర్ర – టీ స్పూన్‌ ; పచ్చి కొబ్బరి ముక్కలు– అర కప్పు ; గసగసాలు– టీ స్పూన్‌.

సాంబార్‌ పోపు కోసం:
►నూనె : టేబుల్‌ స్పూన్‌
►మెంతులు – చిటికెడు
►ఆవాలు– అర టీ స్పూన్‌
►ఇంగువ పొడి – చిటికెడు

►కరివేపాకు– 2 రెమ్మలు
►చింతపండు– 70 గ్రాములు (300 మి.లీ రసం చేయాలి)
►నీరు– ముప్పావు లీటరు
►ఉప్పు – తగినంత.

గార్నిష్‌ చేయడానికి:
►నూనె – 2 టీ స్పూన్‌లు
►వేరుశనగ పప్పు – 4 టేబుల్‌ స్పూన్‌లు
►ఆవాలు – అర టీ స్పూన్‌
►ఎండు మిర్చి– 2
►కొత్తిమీర తరుగు – కప్పు

తయారీ:
►కందిపప్పును ప్రెషర్‌ కుక్కర్‌లో వేసి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి, పసుపు వేసి ఉడికించాలి.
►చల్లారిన తర్వాత ఉప్పు వేసి మెత్తగా పేస్ట్‌ చేయాలి.
►మందపాటి బాణలి వేడి చేసి సాంబార్‌ పేస్టు కోసం తీసుకున్న దినుసులను సన్నమంట మీద వేయించి చల్లారిన తరవాత నీటిని వేస్తూ మెత్తగా గ్రైండ్‌ చేయాలి. 

►బీరకాయ ముక్కల్లో కొద్దిగా నీటిని చిలకరించి మీడియం మంట మీద ఒక మోస్తరుగా ఉడికించాలి.
►మరీ మెత్తగా ఉడకకూడదు.
►మందపాటి పాత్రలో నూనె వేడి చేసి పోపు కోసం తీసుకున్న దినుసులను వేసి వేయించి టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి.

►తర్వాత చింతపండు రసం పోసి కలిపి అందులో సాంబార్‌ పేస్ట్, బీరకాయ ముక్కలు, కందిపప్పు పేస్ట్‌ వేసి కలిపి రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి.
►చిన్న బాణలిలో నూనె వేసి గార్నిష్‌ చేయడానికి తీసుకున్న దినుసులను వేయించి ఉడుకుతున్న సాంబార్‌లో వేసి దించేయాలి.
►ఇది అన్నంలోకి చక్కటి రుచినిస్తుంది. రోటీ చపాతీల్లోకి చేసేటప్పుడు నీటి మోతాదు తగ్గించుకుని చిక్కగా చేసుకోవాలి. 

చదవండి: Recipes: పాలిచ్చే తల్లులకు శ్రేష్ఠం.. సొప్పు పాల్య, మోహన్‌ లడ్డు
తెలంగాణ రెడ్‌ చికెన్‌.. చపాతీ, రోటీలకు మంచి కాంబినేషన్‌

మరిన్ని వార్తలు