Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా

11 Nov, 2022 12:24 IST|Sakshi

ఈ కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ఇంచుమించు ప్రతి ఒక్కరినీ తరచు జలుబు పీడిస్తుంటుంది.  పిల్లలకు ఇష్టమైనవి వండినా సరే...  నాలుకకు రుచి తెలియక  మారాం చేస్తారు. రుచిగా... ఆరోగ్యంగా ఇలా వండి చూడండి.. పిల్లలలే కాదు, పెద్దలు కూడా లొట్టలేసుకుంటూ తింటారు.  

నువ్వుల అన్నం 
కావలసినవి:
►బియ్యం – 2 కప్పులు (అన్నం పలుకుగా వండాలి)
►నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్‌లు
►ఎండు మిర్చి– 4
►మినప్పప్పు – టీ స్పూన్‌

►పచ్చి శనగ పప్పు – టేబుల్‌ స్పూన్‌
►ఆవాలు– అర టీ స్పూన్‌

►పసుపు – అర టీ స్పూన్‌
►వేరుశనగపప్పు – 2 టీ స్పూన్‌లు
►వెల్లుల్లి – 4 రేకలు

►ఇంగువ– చిటికెడు
►కరివేపాకు – రెండు రెమ్మలు
►నువ్వుల నూనె లేదా సాధారణ వంట నూనె– రెండు టేబుల్‌ స్పూన్‌లు
►ఉప్పు – రుచికి తగినంత.

తయారీ:
మందపాటి పెనంలో పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, నువ్వులు వేసి (నూనె లేకుండా) దోరగా వేయించాలి.
చల్లారిన తరవాత మెత్తగా పొడి చేసి ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచాలి
మరొక వెడల్పాటి పెనంలో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత వేరుశనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసి కలిపి దించేయాలి.
ఇందులో అన్నం, ఉప్పు, నువ్వుల మిశ్రమాన్ని వేసి కలపాలి. 

ఇవి కూడా ట్రై చేయండి: Green Amla Juice: డయాబెటిస్‌ను అదుపులో ఉంచే గ్రీన్‌ ఆమ్ల జ్యూస్‌.. బీపీ క్రమబద్ధం చేసే డ్రింక్‌!
Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ

మరిన్ని వార్తలు