మోచేతుల నలుపు తగ్గాలంటే...

16 Feb, 2023 03:48 IST|Sakshi

రోజూ స్నానానికి ముందు నిమ్మరసం రాసి, పది నిమిషాలు ఉంచాలి.
♦ టీ స్పూన్‌ కొబ్బరి నూనె, అర టీ స్పూన్‌ నిమ్మరసం కలిపి మోచేతులు, మోకాళ్లపై రాసి వేడి టవల్‌తో తుడవాలి.
♦ రెండు టీ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్, టీ స్పూన్‌ పంచదార కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్దాలి. ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.
♦ రెండు టీ స్పూన్ల పెరుగులో కొద్దిగా బాదం పొడి కలిపి నలుపుగా ఉన్న చోట రాసి, రుద్ది, శుభ్రపరచాలి.
♦ పాల మీగడలో చిటికెడు పసుపు రాసి, నలుపుగా ఉన్న చోటరాసి, రుద్ది, శుభ్రపరచాలి.
♦ టొమాటో రసం లేదా దానిమ్మ రసం తేనె లేదా నూనెతో కలిపి మోకాళ్లకు, మోచేతులకు రాసి, రుద్ది, శుభ్రపరుచుకుంటే నలుపు సులువుగా తగ్గుతుంది.
♦ నువ్వుల నూనెలో చర్మాన్ని మృదువుగా ఉంచే సుగుణాలు పుష్కలంగా ఉన్నాయి. వారానికోసారి స్నానానికి నువ్వుల నూనె ఉపయోగించడం వల్ల చర్మానికి కావల్సిన ఫ్యాటీ యాసిడ్స్‌ అంది, మృదువుగా అవుతుంది.

మరిన్ని వార్తలు