Cerebrovascular Disease: ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణం ఇదే.. చేపలు తిన్నారంటే..

8 Nov, 2021 12:57 IST|Sakshi

Regularly Consuming Fish May Protect Brain Health: సెరెబ్రోవాస్కులర్ లేదా వాస్కులర్‌ బ్రెయిన్‌ డిసీజ్‌ గురించే ఇప్పుడు అంతటా చర్చజరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో సెరెబ్రోవాస్కులర్ రెండో స్థానంలో ఉంది. ప్రతి ఏట అమెరికాలోని ప్రతి లక్ష మందిలో 37.6 మరణాలు ఈ వ్యాధివల్లనే సంభవిస్తున్నాయి. మెదడులోని రక్త నాళాలు, రక్త ప్రసరణను ప్రభావితం చేసే స్ట్రోక్‌ వంటి సమస్యలకు ఈ వ్యాధి కారణమవుతుందట.

ఏమిటీ సెరెబ్రోవాస్కులర్ డిసీజ్‌?
సెరెబ్రోవాస్కులర్ అనేది రక్త ప్రవాహాన్ని, మెదడులోని రక్త నాళాలను ప్రభావితం చేసే ఓ వ్యాధి. ఈ వ్యాధి వల్ల రక్త నాళాలు కుంచించుకుపోవడం, గడ్డకట్టడం, రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడటం.. వంటి సమస్యలు తలెత్తి ప్రాణాంతకంగా మారుతుంది.

మెదడు సమస్యలతో ప్రారంభమై..
ప్రారంభ దశలో ఈ వ్యాధి తాలూకు ప్రాథమిక లక్షణాలు స్పష్టంగా బయటపడకముందే బ్రెయిన్‌ అబ్నార్మాలిటీస్‌ కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి ముదిరితే డిమెన్షియాకు దారితీస్తుంది. 

చదవండి: 88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!!
 
చేపలకు - ఈ వ్యాధికి మధ్య సంబంధం ఏమిటి?
జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు, శారీరక​ వ్యాయామం, ఆరోగ్య ఆహారపు అలవాట్లు, ధూమపానానికి దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలతో సెరెబ్రోవాస్కులర్ వ్యాధి తాలూకు ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా స్ట్రోక్ ప్రమాదానికి, అధికంగా చేపలను తినడానికి మధ్య సంబంధం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే! ఇది మెదడుకు,  సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి మధ్య వారధిగా పనిచేస్తుందట. ఏదిఏమైనప్పటికీ అధికంగా చేపలు తినడం వల్ల మెదడు దెబ్బతినడం తగ్గుముఖం పడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

అధ్యయన నివేదికల ఫలితాలు ఇలా..
క్రాస్ సెక్షనల్ అధ్యయనాల తాజా నివేదిక ప్రకారం ఆరోగ్యంగా ఉన్న వృద్ధులపై చేసిన పరిశోధనల్లో చేపల వినియోగం, మెదడు దెబ్బతినడం మధ్య సంబంధాన్ని పరిశోధించింది. వారానికి రెండు లేదా మూడు సార్లు చేపలు తినేవారిలో సెరెబ్రోవాస్కులర్ వ్యాధికి కారణమయ్యే మెదడు సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

ఫ్రాన్స్‌లోని బోడో యూనివర్సిటీకి చెందిన సీనియర్‌ రీసెర్చర్‌ డా. సిసిలియా సమీరి ఏంచెబుతున్నారంటే.. ప్రతి వారం రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేపలు తినడం వల్ల మెదడు గాయాలు తగ్గుముఖం పట్టడం పరిశోధనల్లో కనుగొన్నాము. ఐతే 75 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్నవారిలో చేపలు తినడం వల్ల కలిగే ఈ రక్షణా ప్రభావం అంతగా కనిపంచలేదని పేర్కొన్నారు. అంటే చిన్నతనం నుంచే క్రమంతప్పకుండా చేపలు తినడం అలవాటు చేసుకోవాలి. చేపలు అధికంగా తినేవారితో పోల్చితే తక్కువగా తినేవారికి ఈ వ్యాధి ముప్పు అధికమని డా. సిసిలియా సమీరి సూచించారు.

చదవండి: దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!!

మరిన్ని వార్తలు