ఎక్కువ బరువులు ఎత్తడంకంటే ఇలా చేస్తే కండలు ఆరోగ్యంగా పెరుగుతాయి..

20 Jun, 2022 19:46 IST|Sakshi

జిమ్‌లలో వ్యాయామం నిదానంగా చేయాలి. బరువులతో ఎక్సర్‌సైజ్‌ చేసేవారు త్వరగా కండరాలు పెరగాలనే ఉద్దేశంతో బరువులు త్వరత్వరగా పెంచుకుంటూ పోకూడదు. తక్కువ బరువుతో మొదలుపెట్టి... రిపిటీషన్స్‌ ఎక్కువగా చేయాలి. బరువులతో వ్యాయామం చేసేవారు బరువును పెంచడం చాలా నెమ్మదిగా, నిదానంగా చేయాలి. మరీ ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల కండలు ఆరోగ్యకరంగా పెరగవు. హెవీ వెయిట్స్‌తో కండరం మీద ఎక్కువ భారం పడేలా ఎక్సర్‌సైజ్‌ చేయడం కంటే తక్కువ బరువులతో కండరం అలసిపోయేవరకు ఎక్సర్‌సైజ్‌ చేయడం మంచిది. కండరాలు పెరగాలంటే మరింత ప్రోటీన్‌ అందేలా దాన్ని స్టిమ్యులేట్‌ చేయడం మంచిది.

ఇలా స్టిమ్యులేషన్‌ కలగాలంటే... మరీ ఎక్కువ బరువులు ఎత్తడం సరికాదు. దానికి బదులుగా తమకు సౌకర్యంగా ఉండేంత బరువును మాత్రమే ఎత్తుతూ, కండరం అలసిపోయేవరకు ఎక్సర్‌సైజ్‌ చేయాలి. కండరాలు త్వరగా పెరగాలనే ఉద్దేశంతో చాలామంది తాము ఎక్సర్‌సైజ్‌ చేసేప్పుడు బరువులను తొందర తొందరగా పెంచుకుంటూ పోతారు. బరువు పెరుగుతున్న కొద్దీ ఎక్సర్‌సైజ్‌ రిపిటీషన్స్‌ తగ్గుతాయి. దాంతో ఆశించినట్లుగా కండరం పెరగదు. చేస్తున్న ఎక్సర్‌సైజ్‌ను కనీసం 20 సార్లు (ఇరవై కౌంట్‌) చేసేందుకు వీలైనంత బరువును మాత్రమే వేసుకోవాలి. ఇలా తక్కువ బరువుతో ఎక్కువ కౌంట్‌ చేయడం వల్లనే కండరం ఆరోగ్యంగా పెరుగుతుంది.  

మరిన్ని వార్తలు