Cyber Talk: నెట్టింట్లో ఆ వీడియో చూసి షాకైన శశి.. తరువాత ‘ఇదే నిజం’ అంటూ..

14 Apr, 2022 09:06 IST|Sakshi

కాలేజీ కి బయల్దేరుతూ ఫోన్‌ తీసుకొని, కొత్తగా వచ్చిన నోటిఫికేషన్లు చూస్తోంది శశి (పేరు మార్చడమైనది). సోషల్‌ మీడియాలో ‘ఒకబ్బాయి కోసం కొట్టుకుంటున్న ఇద్దరమ్మాయిలు’ అని ట్యాగ్‌లైన్‌తో ఉన్న వీడియో చూసి షాకయ్యింది. ఆ వీడియోలో ఉన్నది తనే. ఆ వీడియోను ఇంట్లో అమ్మనాన్నలు చూశారు. వారికి అసలు విషయం తెలియజేయడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. క్రితం రోజు రాత్రి షాపింగ్‌ పూర్తి చేసుకొని ఇంటికి బయల్దేరేసరికి పది దాటింది.

హడావిడిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న శశికి రోడ్డు పక్కన ఓ అబ్బాయి అమ్మాయితో గొడవపడటం చూసింది. ముందు ‘నాకెందుకులే’ అనుకుంది. కానీ, అక్కడ అమ్మాయి సమస్య అనేసరికి ఉండలేక వారి దగ్గరకెళ్లింది. అబ్బాయి ఆ అమ్మాయిపై చేయి చేసుకోవడంతో శశి ఆ అబ్బాయిని కొట్టింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని కోప్పడి, తను ఇంటికి వచ్చేసింది.

ఎవరు వీడియో తీశారో కానీ, అమ్మాయిలిద్దరూ గొడవపడుతున్న సన్నివేశం, పక్కన అబ్బాయి ఉండటంతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ వీడియోపైన రకరకాల కామెంట్లు. తట్టుకోలేకపోయింది శశి. అయితే, మధ్యాహ్నానికి ఈ అమ్మాయి పరువు తీస్తున్నారు ‘ఇదే నిజం’ అంటూ వచ్చిన మరో వీడియో చూసి ఊపిరి పీల్చుకుంది. శశి పరువు తీసేలా ప్రవర్తించిన వ్యక్తి పోస్ట్‌కి నెటిజన్లు ఘాటుగా కామెంట్లు పెట్టారు.  
   
సోషల్‌ మీడియాలో అంతా నిజం అనదగినవి ఏమీ లేవు. సోషల్‌ మీడియాలో ఉన్న రిపుటేషన్‌ బట్టి జీవితాలు మారిపోతున్న రోజులివి. ప్రెగ్నెన్సీ, బ్రేకప్స్, విడాకులు, న్యూ రిలేషన్స్, ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌.. అన్నీ సోషల్‌ మీడియాలో ఉంటున్నాయి. వీటికి మంచి, చెడు కామెంట్స్‌ వస్తూనే ఉన్నాయి. సెలబ్రిటీలకు సంబంధించినవైతే ఇక లెక్కే ఉండవు. 

కొన్ని వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేవి ఉంటే సంస్థల వైపు మరోవిధంగా ఉంటున్నాయి. ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో ఏ వస్తువు కొనాలన్నా, ఏ రెస్టారెంట్‌కు వెళ్లాలన్నా..  వాటికి సంబంధించిన మంచి–చెడులను కామెంట్స్, రివ్యూల రూపంలో పెట్టేస్తున్నారు. పుకార్లు, అబద్దాలు, చెడు సమీక్షలు.. రకరకాల పోస్ట్‌ల్లో కనిపిస్తే.. ఏం జరుగుతుందో సోషల్‌ మీడియాలో ఉండేవారికి తప్పక తెలుసుండాలి. 

ప్రతిష్ట ఎలా దెబ్బతింటుంది?  
►ఆన్‌లైన్‌లో వచ్చిన రకరకాల వార్తాకథనాలు సరైనవే అని నమ్ముతుంటారు. ఇవి, ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలకు, సంస్థలకు సంబంధించినవి ఉంటాయి.  

►ఇతరులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో లీక్‌ చేయడం. బ్లాగుల్లో తప్పుడు సమాచారం ఇవ్వడం.   

►కస్టమర్ల రివ్యూల ఆధారంగా వినియోగదారులకు మార్గదర్శకం చేసే రివ్యూ సైట్లు.  

►గాసిప్‌లను వ్యాప్తి చేయడం, పబ్లిక్‌ వ్యక్తులను విమర్శించడం వంటివి.  

లిజనింగ్‌ టూల్స్‌ తప్పనిసరి.. 
మనకు సంబంధించిన మంచి చెడులను తీసుకొని, మనకు ఇన్‌ఫార్మ్‌ చేస్తుంటాయి లిజనింగ్‌టూల్స్‌. ప్రతి ఒక్కరూ తమ సోషల్‌ నెట్‌వర్క్‌లలో సానుకూల కామెంట్లు, రివ్యూలను ఆశించే పోస్ట్‌లు పెడుతుంటారు. దీనికి ప్రతికూల అభిప్రాయం వస్తే సోషల్‌ మీడియాలో మీ కీర్తి దెబ్బతింటుంది. సంస్థలు అయితే తమ వ్యాపారంలో నష్టాన్ని చూడాల్సి రావచ్చు. తమ బ్రాండ్‌ లేదా తమ వ్యక్తిత్వం చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సోషల్‌ లిజనింగ్, మానిటరింగ్‌ సాధనాలు వాడటం చాలా ముఖ్యం. కొన్ని ప్రముఖ సోషల్‌ మీడియా లిజనింగ్‌ టూల్స్‌ సైట్స్‌ ఇవి.  

► https://www.falcon.io/
► https://wwww.brand24.com/
► https://www.digimind.com/
► https://youscan.io/
► https://brandmentions.com/
► https://buzzsumo.com/

షెడ్యూలింగ్‌ టూల్స్‌ 
కంటెంట్‌ ముందుగా సిద్ధం చేసిపెట్టుకొని, సమయానుకూలంగా పోస్ట్‌ అవ్వాలని ఆప్షన్‌ పెట్టుకుంటే దానికి అనుగుణంగా పోస్ట్‌ చేస్తుంది ఈ యాప్‌. ఇవి మీ సోషల్‌ మీడియా ఖాతాల మొత్తం నిర్వహణలో సహాయపడతాయి. సరైన కంటెంట్‌ను సృష్టించడానికి, నిజమైన కనెక్షన్లను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి.

► https://sproutsocial.com/
► https://coschedule.com/
► https://feedly.com/
► https://www.airtable.com/
► https://planable.io/
► https://skedsocial.com/

ఆన్‌లైన్‌లో మంచి పేరు సంపాదించుకోవాలంటే సరైన కంటెంట్‌ను పోస్ట్‌ చేయాలి. లైక్‌లు, ఫాలోవర్లకు బదులు రివ్యూలపై దృష్టి పెట్టాలి. ప్రతికూలంగా వచ్చే ఫీడ్‌బ్యాక్‌లపై దృష్టిపెట్టాలి. మన ప్రతిష్టను ప్రభావితం చేసే సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సోషల్‌ మీడియా లిజనింగ్‌ టూల్స్, షెడ్యూలింగ్‌ టూల్స్‌ తప్పక ఉపయోగించాలి. ఆఫ్‌లైన్‌లో ఎలాంటి ప్రతిష్టను కోరుకుంటారో, ఆన్‌లైన్‌లోనూ అలాంటి రిప్యుటేషన్‌ ను పొందాలనుకోవడం ముఖ్యం. 

మరిన్ని వార్తలు