రైనోస్టోన్‌ మాస్క్‌.. వెలిగిపోండిక

22 May, 2021 15:22 IST|Sakshi

ఫేస్‌మాస్క్‌ల కాలం ఇది. ఎప్పుడూ ఒకే స్టైల్‌వి ధరించాలన్నా బోర్‌గా ఫీలయ్యే కాలం. అందుకే డిజైనర్లు వీటిలో విభిన్నరకాల మోడల్స్‌తో మెరిపిస్తున్నారు. కొన్ని ముత్యాలు, ఇంకొన్ని రంగురాళ్లు.. అవీ కాదంటే కొన్ని రత్నాలతో సింగారించి ఇలా మెరిపిస్తున్నారు. ఆకాశంలో నక్షత్రాలను చీరలపై సింగారించారా.. అని పొగిడే కాలం పోయి మాస్క్‌ మీద మెరిపించారా.. అనకుండా ఉండలేరు.

పార్టీవేర్‌ మాస్క్‌గా ఈ రైనోస్టోన్‌ మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. ధరలు స్టోన్స్, డిజైన్‌ బట్టి ఉన్నాయి. ప్లెయిన్‌ శాటిన్‌ ఫ్యాబ్రిక్‌ను మూడు పొరలుగా తీసుకొని, మాస్క్‌ను కుట్టి, రైనోస్టోన్స్‌ అతికించినా పార్టీవేర్‌ మాస్క్‌ రెడీ అన్నమాట. డ్రెస్‌కు మ్యాచింగ్‌ అయ్యేలానూ డిజైన్‌ చేసుకోవచ్చు.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు