ఎలుక అనుకొని మౌస్‌ మింగేసింది! ‘మీకు ఈ ఐడియాలు ఎలా వస్తాయి’?

30 Sep, 2022 12:39 IST|Sakshi
ఆండ్రూ కిల్‌మోవ్‌ కార్టూన్‌(Photo Credit: Andrew Kim Love)

రష్యన్‌ కార్టూనిస్ట్‌ ఆండ్రూ కిల్‌మోవ్‌ గీసిన కార్టూన్‌ ఇది. వేడి వేడి రాజకీయ కార్టూన్‌లు గీయడంలో ప్రసిద్ధుడైన కిల్‌మోవ్‌ అప్పుడప్పుడూ ఇలాంటి రాజకీయేతర కార్టూన్‌లు కూడా గీసి నవ్విస్తుంటాడు. ‘అజర్‌కాంట్‌’ పేరుతో సైన్స్‌–ఫిక్షన్‌ షార్ట్‌ యానిమెటెడ్‌ ఫిల్మ్‌ తీసి శభాష్‌ అనిపించుకున్నాడు.

‘మీకు ఐడియాలు ఎలా వస్తుంటాయి?’ అని కుర్రకారు కిల్‌మోవ్‌ను అడుగుతుంటారు. ‘ఐడియా కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. టైమ్‌ వస్తే అదే మనల్ని వెదుక్కుంటూ వస్తుంది’ అని హాయిగా నవ్వుతాడు మోవ్‌. అంతేకదా మరి! 

చదవండి: Cyber Security Tips: పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారు? డిజిటల్‌ రాక్షసులుగా మారకుండా..
International Safe Abortion Day: ఈ దేహం నాది ఈ గర్భసంచి నాది

మరిన్ని వార్తలు