ఈ దోమ ఎగురుతుంటే సీతాకోకచిలుకలా.. మోస్ట్‌ బ్యూటిఫుల్‌..!

10 Oct, 2021 10:23 IST|Sakshi

ఒక ఈగను పెట్టి ఓ రివేంజ్‌ స్టోరీ డైరెక్ట్‌ చేశాడు రాజమౌళి.  అదే డైరెక్టర్‌ ఈ దోమను చూసి ఉంటే మాత్రం కచ్చితంగా ఓ అద్భుతమైన లవ్‌స్టోరీని తీసేవాడు. ఆ దోమ అంత అందమైంది మరి.

దోమ అందంగా ఉండటం ఏంటీ? అని చిరాకుపడకండి. మనుషుల్లోనూ అందమైన ముఖం కలిగిన వారు ఉన్నట్లు.. దోమల్లోనూ అందమైన రూపం కలిగిన దోమలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ, మధ్య అమెరికా ఉష్ణమండల అడువుల్లో కనిపించే ‘సబెథెస్‌ దోమ’.

ఈ జాతి దోమలకు అందమైన కాళ్లు, చక్కటి శరీర ఛాయ ఉంటుంది. అంతేకాదు.. వాటి కాళ్లకు ఉన్న చిన్న చిన్న ఈకల కారణంగా ఈ దోమ ఎగురుతుంటే సీతాకోకచిలుకలా కనిపిస్తుంది. మొదట ఇతర దోమలను ఆకర్షించడానికి, సంభోగంలో పాత్ర పోషించడానికి, ఇవి ఈ ఈకలను ఉపయోగిస్తున్నాయి అని శాస్త్రవేత్తలు తేల్చినా, తర్వాత వాటి ఈకలను తొలగించి పరిశీలిస్తే.. అవి చక్కగా సంభోగంలో పాల్గొంటున్నాయని తేలింది. దీంతో, ప్రస్తుతం వీటికున్న ఆ అద్భుతమైన కాళ్ల కారణం ఏంటో తెలియదు కానీ, దీనిని మాత్రం అత్యంత అందమైన దోమగా శాస్త్రవేత్తలు పరిగణించారు. ఎంత అందమైన దోమ అయితేనేం.. ఇది కూడా జ్వరం, డెంగ్యూ వంటి వ్యాధుల కారకమే కదా! 

చదవండి: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు..

మరిన్ని వార్తలు