మా సంస్థ అంకిత భావాన్ని గుర్తించి  ఈ అవార్డును అందించినందుకు మనసారా కృతజ్ఞతలు: స్వేరోస్‌

25 Sep, 2021 11:07 IST|Sakshi

Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్‌ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ అవార్డును తెలంగాణ స్వేరోస్‌ సంస్థ తరపున శాయన్న అందుకున్నారు.

చదువు అంటే కేవలం పుస్తకాలను బట్టీ పట్టడం కాదు. నాలెడ్జ్‌తో పాటు ఫిజికల్‌ ఎడ్యుకేషన్, మోరల్‌ సైన్స్, ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌ వంటి పాఠ్యేతర అంశాల్లోనూ ప్రావీణ్యం కలిగి ఉండాలి.  అందుకోసమే తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఆ స్ఫూర్తితో 1984లో ‘స్వేరోస్‌’ పేరుతో విద్యార్థులే నిజామాబాద్‌ లో ఒక బృందంగా ఏర్పడి విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడుతున్నారు. అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్స్, విలేజ్‌ లెర్నింగ్‌ సెంటర్స్, వొకేషనల్‌ ట్రయినింగ్‌ సెంటర్స్, స్వేరోస్‌ సర్కిల్‌ వంటి వాటి ఏర్పాటుతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది స్వేరోస్‌. 


ఆయనకే అంకితం
పేదల బతుకుల బాగు కోసం కృషి చేస్తున్న మా సంస్థ అంకిత భావాన్ని గుర్తించి  ఈ అవార్డును మాకు అందించారు. దీనికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థలో నన్ను భాగస్వామి చేసినందుకుగాను ఈ అవార్డును ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గారికి అంకితం చేస్తున్నా.
– శాయన్న,స్వేరోస్‌ ఇంటర్నేషనల్‌

మరిన్ని వార్తలు