పేదరికాన్ని నిర్మూలించడంలో ‘నాంది ఫౌండేషన్‌’ సేవలు భేష్‌!

25 Sep, 2021 10:50 IST|Sakshi

Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్‌ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌’ అవార్డును నాంది ఫౌండేషన్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌ కె సతీష్‌ కుమార్ అందుకున్నారు.

పేదరికాన్ని నిర్మూలించడానికి నిస్వార్థంగా ఆవిర్భవించినదే.. ‘నాంది’ ఫౌండేషన్‌. ఎ.పి., తెలంగాణతో సహా దేశంలోని 17 రాష్ట్రాలలో ఇంతవరకు 70 లక్షల మంది జీవితాల్లో మార్పు తెచ్చిన ‘నాంది’ 1998లో హైదరాబాద్‌లో ఆవిర్భవించింది. పేదరికాన్ని నిర్మూలించే ఒక శక్తిగా అవతరించింది. ఆదివాసీ వ్యవసాయదారులకు చేయూతనిచ్చి, వారితో చేతులు కలిపి లక్ష మందిని దారిద్య్రరేఖ దిగువ నుంచి ఎగువకు తెచ్చింది.  ‘అరకు కాఫీ’తో దేశానికి బ్రాండ్‌ ఇమేజ్‌ తెచ్చింది. అల్పాదాయ కుటుంబాల్లోని 4 లక్షల మంది బాలికలకు విద్యను అందించింది. 

బాధ్యత పెంచింది
సాక్షి మీడియా గ్రూప్‌కు, న్యాయ నిర్ణేతల బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అవార్డు మాలో మరింత బాధ్యతను పెంచింది. పాఠశాల విద్యార్ధుల కోసం మేం చేస్తున్న కృషి ఫలాలు మరింత మందికి అందాలని కోరుకుంటున్నాం.
– కె. సతీష్‌ కుమార్, ఆరకు ఫైనాన్స్‌  మేనేజర్‌

మరిన్ని వార్తలు