సాక్షి అవార్డు అందుకోవడం చాలా గర్వంగా ఉంది: సుబ్బు పరమేశ్వరన్

25 Sep, 2021 12:11 IST|Sakshi

Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో ‘సాక్షి మీడియా 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్‌ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ ’ అవార్డును లెర్నింగ్‌ కర్వ్‌ ఫౌండేషన్‌ స్థాపకుడు సుబ్బు పరమేశ్వరన్  అందుకున్నారు.

విద్యార్థి దశలోనే పిల్లలకి సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను అందించేందుకు నడుం బిగించింది లెర్నింగ్‌ కర్వ్‌ ఫౌండేషన్‌.  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో అనుసంధానమై పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.  సామాజిక, మనోవైజ్ఞానిక బోధనల విధానాలపై ఉపాధ్యాయులకు కూడా ఈ సంస్థ శిక్షణ ఇచ్చింది. 2016లో హైదరాబాద్‌లో ఆవిర్భవించిన ఈ సంస్థ ఇప్పటి వరకు దేశంలోని 200 పాఠశాలలకు చెందిన 13 వందల మంది ఉపాధ్యాయులు, 42,500 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చింది. అందరూ విస్మరించిన ఒక మౌలికమైన సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించడం ద్వారా విద్యార్థుల బహువిధ నిపుణతల కోసం లెర్నింగ్‌ కర్వ్‌ ఫౌండేషన్‌ కృషి చేస్తోంది.

గర్వించే క్షణం
ఈ అవార్డు అందుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నాను. సాక్షికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు, ప్రైవేటు లో బడ్జెట్‌ విద్యార్థుల కోసం చేస్తున్న కృషి మరింత మందికి చేరాలని కోరుకుంటున్నాం.

>
మరిన్ని వార్తలు