మంచి ర్యాంక్‌కు మాక్‌ టెస్టులు

17 Jun, 2022 09:25 IST|Sakshi

సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో నీట్, ఎంసెట్‌ / ఈఏపీసెట్‌ విద్యార్థుల కోసం  

కొనసాగుతున్న ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు 

ప్రిపరేషన్‌ స్థాయిని తెలుసుకునేందుకు అవకాశం 

టాప్‌ టెన్‌ ర్యాంకర్లకు ఆకర్షణీయ బహుమతులు 

సాక్షి మీడియా గ్రూప్, నారాయణ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌(తెలంగాణ)/ ఈఏపీసెట్‌(ఆంధ్రప్రదేశ్‌), నీట్‌ మాక్‌ టెస్టులు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్‌. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్‌/మెడికల్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకోసం ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌కు పంపిస్తున్నారు.

ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ‘నీట్‌’.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌/అగ్రికల్చర్‌ తదితర కోర్సుల్లో అడ్మిషన్‌ కల్పించే ఎంసెట్‌/ఈఏపీసెట్‌ కోసం లక్షల మంది సన్నద్ధమవుతున్నారు. వీరికి చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించిన ఎంసెట్‌/ఈఏపీసెట్, నీట్‌ మాక్‌ టెస్టులను నిర్వహించనున్నారు. పరీక్షకు ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే ‘సాక్షి’ మాక్‌ టెస్ట్‌ రాయడం ద్వారా.. విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ స్థాయిని అంచనా వేసుకొని, మరింత మెరుగుపడవచ్చు. అలాగే ‘సాక్షి’ మాక్‌ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపిన టాప్‌ టెన్‌ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు. ఆన్‌లైన్‌ టెస్ట్‌లకు టెక్నాలజీ పార్ట్‌నర్‌గా‘MY RANK’ వారు వ్యవహరిస్తున్నారు.

►సాక్షి మాక్‌ ఎంసెట్‌ (ఇంజనీరింగ్‌) /ఈఏపీసెట్‌ పరీక్ష 30.06.2022. 
►ఎంసెట్‌ / ఈఏపీసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్ష 01.07.2022 తేదీల్లో ఆన్‌లైన్‌లో
జరుగుతుంది.   
►సాక్షి మాక్‌ నీట్‌ పరీక్ష 03.07.2022 ఆఫ్‌లైన్‌ విధానంలో జరుగుతుంది.   
►ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.250. అభ్యర్థులు http://www.arenaone.in/mock ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విజయవంతంగా దరఖాస్తులు పూర్తిచేసిన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్‌ మీరు రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్‌ నంబర్‌కు వస్తుంది.
 

పరీక్ష కేంద్రం: విజ్ఞాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్,
దేశ్‌ముఖి గ్రామం, పోచంపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా.  
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 25.06.2022 
వివరాలకు సంప్రదించాల్సిన నంబర్‌:  
9666013544

మరిన్ని వార్తలు