Anam Darbar: సెలబ్రిటీ డాటర్‌ అట్రాక్టివ్‌ అనమ్‌!

19 May, 2021 09:29 IST|Sakshi

తల్లిదండ్రుల సెలబ్రెటీ హోదాను వాడుకుని పాపులర్‌ అయ్యేవారు కొందరైతే.. సెలబ్రిటీ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ తమ సొంత ప్రతిభతో స్టార్‌లుగా మెరుస్తున్నవారు మరికొందరు. ఇటువంటి వారికి ఉదాహరణగా నిలుస్తోంది.. ‘అనమ్‌ దర్బార్‌’. ముంబైకి చెందిన 23 ఏళ్ల అనమ్‌ దర్బార్‌ 22 లక్షలమంది ఫాలోవర్స్‌తో సోషల్‌ మీడియా స్టార్‌గా దూసుకుపోతోంది.

ఎంతో క్యూట్‌గా కనిపించే అనమ్‌ .. మోడల్, డ్యాన్సర్, యూట్యూబర్, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌. 2017లో టిక్‌టాక్‌తో సోషల్‌ మీడియాకు పరిచయమైన అనమ్‌... కొత్తగా కంటెంట్‌ను క్రియేట్‌ చేసేది. ట్రెండింగ్‌ టాపిక్స్‌పై వీడియోలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేది. అంతేగాకుండా లిప్‌సింక్, కామెడీ వీడియోలను సరికొత్తగా చేసి టిక్‌టాక్‌ ఫాలోవర్స్‌ను తనవైపు తిప్పుకుంది. దీంతో తన వీడియోలు చూసే ఫాలోవర్స్‌ సంఖ్య ఎనిమిది మిలియన్లకు చేరింది.

అయితే కొన్ని కారణాలతో ఇండియాలో టిక్‌టాక్‌ బ్యాన్‌ చేయడంతో.. అనమ్‌ తన సొంత యూట్యూబ్‌ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రాంక్‌ వీడియోలు, డ్యాన్సింగ్‌ వీడియోలు, మేకప్‌ ట్యూటోరియల్స్, ట్రావెల్‌ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అనమ్‌ వీడియోలు బాగా పాపులర్‌ అవడంతో తన ఫోటో చాలా మ్యాగజీన్‌ల కవర్‌ పేజీలపై కనిపిస్తోంది. ఇవేగాక ప్రింట్‌ షూట్స్‌లో పనిచేస్తూ తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది.

మహారాష్ట్రలోని ముంబైలో పుట్టిపెరిగిన అనమ్‌ ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇస్మాయేల్‌ దర్బార్‌ గారాల పట్టి. పాపులర్‌ కొరియోగ్రాఫర్, టిక్‌ టాక్‌ స్టార్‌ అవేజ్‌ దర్బార్‌కు స్వయానా చెల్లెలు. అవేజ్‌ దర్బార్, జైద్‌ దర్బార్‌లు ఇద్దరూ పాపులర్‌ కొరియోగ్రాఫర్స్, కంటెంట్‌ క్రియేటర్స్, ఎంటర్‌టెయినర్స్‌కు అనమ్‌ ఒకరికి చెల్లి అయితే మరొకరి అక్క. సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌ అయిన ‘బి యూ ఇన్‌’, ‘అత్రంగజ్‌’ డ్యాన్స్‌ స్టూడియోలను అవేజ్‌ నిర్వహిస్తున్నాడు. ఎంతోమంది బాలీవుడ్‌ సెలబ్రెటీలకు డ్యాన్స్‌ నేర్పించిన ఈ స్టూడియోలలో అనమ్‌ సభ్యురాలుగా ఉంది. అంతేగాక తన అన్నయ్యలతో కలసి అనేక డ్యాన్స్‌ వీడియోలు రూపొందించింది.

అన్నయ్య ప్రేరణతో..
ముంబైలోనే పెరిగిన అనమ్‌ కామర్స్‌ గ్రాడ్యుయేట్‌. అనమ్‌ సెలబ్రెటీ కాకముందు కొంచెం లేజీగా ఉండేది. అయితే అవేజ్, అవేజ్‌ స్నేహితురాలు నగ్మా మిరాజ్కర్‌ కలిసి టిక్‌టాక్‌ వీడియోలు చేస్తుండడం చూసి.. వారిని ప్రేరణగా తీసుకుని తను కూడా వీడియోలు రూపొందించి టిక్‌టాక్‌లో పోస్టు చేసేది. చూస్తుండగానే బాగా పాపులర్‌ అయ్యింది. కొద్దికాలంలోనే తన వీడియోలను ఇష్టపడే వారి సంఖ్య లక్షలకు చేరింది. తన వీడియోలతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోన్న అనమ్‌ ఇండో వెస్ట్రన్‌ ఫ్యాషన్‌ను బాగా ఇష్టపడుతుంది. చేతిమీద ఇంగ్లిష్‌ అక్షరాల్లో ‘పాజిటివిటి’ అని ట్యాటూ వేసుకుని అంతే పాజిటివ్‌ ఆలోచనలతో ముందుకు సాగుతోంది.

ఒకపక్క తన వీడియోలతో సోషల్‌ మీడియా నెటిజన్లను అలరిస్తూనే మరోపక్క ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, యాడ్‌లలో నటించడం ద్వారా, ఫ్యాషన్‌ బ్రాండ్లను ప్రమోట్‌ చేయడం ద్వారా బాగానే సంపాదిస్తోంది. తన సంపాదనలో కొంత భాగాన్ని ఎన్జీవోలకు విరాళంగా ఇస్తూ ఎంతోమందికి విద్యాదానం చే స్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు