Light Pulse Echo Lantern: అరుదైన లాంతరు.. ఉప్పునీటితో వెలుగుతుంది

27 Apr, 2022 14:05 IST|Sakshi

దీపం వెలగాలంటే ఏం కావాలి? పాతకాలం దీపాలకైతే, నూనె కావాలి. ఇప్పటి దీపాలకైతే కరెంటు కావాలి. కనీసం బ్యాటరీ కావాలి. ఈ ఫొటోలో కనిపిస్తున్న లాంతరుదీపానికి మాత్రం ఉప్పునీరు ఉంటే చాలు. ఇది వెలుతురు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాదు, ఈ లాంతరుకు ఉన్న యూఎస్‌బీ పోర్టు ద్వారా దీపం వెలుగుతూ ఉండగా, మొబైల్‌ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను చార్జింగ్‌ చేసుకోవచ్చు కూడా.

‘లైట్‌పల్స్‌ ఎకో లాంతర్‌’ పేరిట ‘గ్యాలప్‌ ఇన్నోటెక్‌’ అనే చైనా కంపెనీ రూపొందించింది. ఇంతకీ ఉప్పునీటితో ఇదెలా వెలుగుతుందనేగా మీ అనుమానం. మామూలు లాంతరులో కిరోసిన్‌ నింపే బదులు, ఇందులో ఉప్పునీరు నింపుకోవాలి. దీని అడుగుభాగంలో అల్యూమినియం ప్లేట్‌ ఉంటుంది. దాంతో జరిపే రసాయనిక చర్య వల్ల పుట్టే విద్యుత్తే దీనికి ఇంధనం. ఈ లాంతరు వెలుతురును కోరుకున్న విధంగా అడ్జస్ట్‌ చేసుకునే వెసులుబాటూ ఉంది. 

చదవండి: ప్రపంచంలోనే సన్న భవనం

మరిన్ని వార్తలు