Sharp Wooden Knife: కలప కత్తి... కత్తి కాదు అంతకు మించి గురూ!

31 Oct, 2021 09:16 IST|Sakshi

కలపను కట్‌ చేసే కత్తులను చూసి ఉంటారు.. కానీ, కత్తినే కట్‌ చేసే కలపకత్తిని చూశారా? కూరగాయలు, పండ్లతోపాటు మాంసం ముక్కలను కూడా ఈజీగా కట్‌ చేయగలదు ఈ కత్తి. సాధారణ లోహపు కత్తి కంటే ఇది 23 రెట్లు బలమైనది, మూడు రెట్లు పదునైనది.

కూరగాయలు కట్‌ చేసే కత్తుల్లో ఎక్కువగా స్టీల్, ఇనుము వంటి లోహాలనే ఎందుకు వాడటం.. విరివిగా దొరికే కలపను ఎందుకు ఉపయోగించ కూడదు అని ఓ విద్యార్థికి వచ్చిన అద్భుతమైన ఆలోచనే ఈ రూపకల్పనకు దారితీసింది. ఇందుకు అమెరికాలోని మేరిల్యాండ్‌ యూనివర్సిటీ అధ్యాపకులు కూడా సహాయం చేయడంతో చక్కటి ఈ కలపకత్తి తయారైంది.

సాధారణ కత్తిలాగే.. సెల్యులోజ్, ఇతర రసాయనాలను ఓ ప్రత్యేకమైన కలపతో చేర్చి, అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడిని ఉపయోగించి, దీనిని తయారు చేశారు. అయితే, దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్‌ టెంగ్‌ లీ తెలిపారు. ఏదిఏమైనా.. కలపకత్తి ‘కత్తి’లా ఉంది కదూ! 

చదవండి: వంగే రాయి.. ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారోయి..!

మరిన్ని వార్తలు