అనుకోని ప్రమాదంలో చిద్రమైన వ్యక్తి ముఖాన్ని పునర్నిర్మించిన శాస్త్రవేత్తలు!

26 Dec, 2023 16:41 IST|Sakshi

అనుకోని ప్రమాదంలో చిద్రమైన ఓ వ్యక్తి ముఖాన్ని పునర్నిర్నించారు శాస్త్రవేత్తలు. ఏకంగా 28 గ్రాములు రాడ్‌ ఎడమ చెంపలోంచి తలలోకి దూసుకుపోయింది. సరిగ్గా 175 ఏళ్ల క్రితం ఓ దారుణ ప్రమాదంలో ముఖం చిద్రం అయిన వ్యక్తి ముఖాన్ని త్రీ డీ సాంకేతికతో పునర్నిర్మించారు శాస్త్రవేత్తలు. దీంతో వైద్య విధానంలో సరికొత్త విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. 

అసలేం జరిగిందంటే..యూఎస్‌కి చెందిన ఫినియాస్‌ గేజ్‌ అనే రైల్‌రోడ్‌ కార్మికుడు సెప్టెంబర్‌ 13, 1848లో విచిత్రమైన ప్రమాదానికి గురయ్యాడు. అతను అమెరికాలోని వెర్మోంట్‌లో కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం కోసం కొన్ని రాళ్లను పేల్చివేయడానికి సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం బారినపడ్డాడు. అతను వదిలేసిన ఇనుపరాడ్‌ గన్‌పౌడర్‌కి తగిలి ఎగొరొచ్చి నేరుగా అతని ఎడమ చెంపలోకి దూసుకుపోయింది. సుమారు 3.18 సెంటీమీటర్ల వ్యాసం, 1.09 మీటర పొడవుతో సుమారు ఆరు కిలోగ్రాముల ఉన్న రాడ్‌ అతని బ్రెయిన్‌లో దూసుకోపోయింది.

వెంటనే హుటాహుటినా ఆస్పత్రికి తరలించి గేజ్‌ పుర్రెలోకి దిగిన రాడ్‌ని వైద్యుడు తొలగించి కుట్టు వేశారు. అయితే ఆ ప్రమాదం అతని ముఖాన్ని భయానకంగా మార్చింది. అదిగాక ఈ ప్రమాదం తర్వాత అతని యాక్టివిటీలో మార్పు వచ్చింది. చెప్పాలంటే ఓ చిన్న పిల్లవాడి మాదిరిలా బిహేవ్‌ చేయడం మొదలు పెట్టాడు. అలా అతను యాక్సిడెంట్‌ తర్వాత సుమారు 12 ఏళ్ల ఆరు నెలల ఎనిమిది రోజుల వరకు బతికాడు. సరిగ్గా మే 21, 1861న తుది శ్వాస విడిచాడు. అయితే ఆ వ్యక్తి ముఖాన్ని యథావిధిగా పునర్నిర్మించడంపై పరిశోధకులు రకరకాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.

ఈ మేరకు ఫోరెన్సిక్‌ నిపుణుడు సిసెరో మోరేస్‌ అతడి ముఖాన్ని త్రీడీ టెక్నాలజీతో పునర్నించాడు. అందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ని యూట్యూబ్‌లో షేర్‌ చేశాడు. వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా సాంకేతికతను జోడించి ఇలాంటి ప్రమాదాల బారిన పడిన రోగులకు ఉపయుక్తంగా ఉండేలా సరికొత్త చికిత్స పద్ధతులను అభివృద్ధి పరిచారు. రోడ్డుప్రమాదాలు లేదా ఇతరత్ర ప్రమాదాల్లో ముఖం చిద్రమైన వాళ్లకి ఈ సాంకేతికతో కూడిన వైద్యం ఉపయోగ పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేగాదు గేజ్‌ ప్రమాద సమయంలో ఎలా ఉన్నాడు? ఎలా ఆ రాడ్‌ని తొలగించి పునర్నిర్మించొచ్చు వంటి వాటిని  ఓ వీడియోలో విజ్యువల్స్‌ రూపంలో వెల్లడించారు. 

(చదవండి: 'బిగ్‌ విన్‌'! ఒక్క వీడియో..ప్రముఖ ఫుడ్‌ కంపెనీని షేక్‌ చేసింది! చరిత్రలో తొలిసారి..)

>
మరిన్ని వార్తలు