What Is Septic Shock: నటుడు శరత్‌బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!

19 Feb, 2024 15:53 IST|Sakshi

టాలీవుడ్‌ నటుడు శరత్‌ బాబు తెలుగు , కన్నడతో సహా వివిధ భాషలలో హీరోగా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అలా ఆయన దాదాపు 230కి పైగా చిత్రాల్లో నటించారు . ఆయన క్యారెక్టర్ రోల్స్‌లో కూడా ప్రేక్షకులను అలరించారు. చివరికి 71 ఏళ్ల వయసులో ఈ మహమ్మారి సెప్సిస్‌ బారిన పడి మృతి చెందారు. ఆఖరి దశలో తీవ్ర ఇన్ఫెక్షన్‌కు గురై చాల రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఆయనకు వచ్చిన సెప్సిస్‌ ప్రాణాంతకమా? ఎందువల్ల వస్తుంది..?

సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్‌కి సంబంధించిన తీవ్ర దశ. దీని కారణంగా శరీరంలో ఒక్కసారిగా రక్తపోటు పడిపోయి శరీరం తీవ్ర ఇన్ఫెక్షన్‌కు గురవ్వుతుంది. ఈ పరిస్థితి ప్రాణాంతకమైనది. ఈ దశలో మెదడు నుంచి సమస్త అవయవాలు వైఫల్యం చెంది పరిస్థితి విషమంగా మారిపోతుంది. దీన్ని బహుళ అవయవాల వైఫల్యానికి దారితీసే వైద్య పరిస్థితి అని అంటారు.  

సెప్సిస్‌ అంటే..
సెప్సిస్‌ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)గా పిలుస్తారు. అంటే.. ఇన్ఫెక్షనకు శరీరం తీవ్ర ప్రతిస్పందించడం అని అర్థం. ఈ పరిస్థితి ఎప్పుడు సంభవిస్తుందటే..శరీరం అంతటా ఇన్షెక్షన్‌ చైన్‌ రియాక్షన్‌లా వ్యాపించడం జరిగితే ఈ సెప్సిస్‌ బారిన పడటం జరుగుతుంది. చాలా వరకు రోగిని ఆస్పత్రికి తీసుకు వెళ్లే ముందు ప్రారంభమవుతాయి. ఈ సెప్సిస్‌ ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తులు, మూత్రనాళాలు, చర్మం లేదా జీర్ణశయాంతర ప్రేగుల నుంచి ప్రారంభమవుతాయి. 

కారణం..
సూక్ష్మక్రిములు ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తాయి.ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపించడం ప్రారంభిస్తుంది. అయితే దీనికి చికిత్స తీసుకుంటూ ఆపేసినా లేక తీసుకోకపోయినా సెప్సిస్‌ బారిన పడటం జరుగుతుంది. చాలా వరకు బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు సెప్సిస్‌కు కారణం. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కూడా సంభవించవచ్చు. ఈ సెప్సిస్‌ని శరీరంలో అభివృద్ధి చేసే వ్యక్తులు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల లేదా బలహీనమైన రోగనిరోధక వ్యకవస్థతో తీవ్ర వైద్య పరిస్థితిని కలిగి ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్‌తో బాధపడే వారిలో దాదాపు పావు నుంచి ఒక వంతు దాక ఆస్పత్రిని సందిర్శించిన ఒక్క వారంలోనే మళ్లీ ఆస్పత్రిలో చేరడం జరుగుతుంది. 

సెప్సిస్‌ దశలు..
మూడు దశలు
సెప్సిస్: ఇది రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్‌కు అతిగా స్పందించే పరిస్థితి.
తీవ్రమైన సెప్సిస్: సెప్సిస్ అవయవాలు పనిచేయకపోవడానికి కారణమవుతుంది. ఇది సాధారణంగా తక్కువ రక్తపోటు, వాపు ఫలితంగా జరుగుతుంది.
సెప్టిక్ షాక్: సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్ చివరి దశ. చాలా IV (ఇంట్రావీనస్) ద్రవాలు ఉన్నప్పటికీ, ఇది అత్యంత తక్కువ రక్తపోటు ద్వారా నిర్వచించబడింది. ఈ దశ ప్రాణాంతకమని చెప్పొచ్చు. 

లక్షణాలు..

 • వేగవంతమైన హృదయ స్పందన రేటు
 • జ్వరం లేదా అల్పోష్ణస్థితి (ఉష్ణోగ్రతలు పడిపోవడం)
 • వణుకు లేదా చలి
 • వెచ్చగా, తడిగా లేదా చెమటతో కూడిన చర్మం
 • గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి
 • హైపర్‌వెంటిలేషన్ (వేగవంతమైన శ్వాస)
 • శ్వాస ఆడకపోవుట.

సెప్టక్‌ షాక్‌ లేదా చివరి దశకు చేరినప్పుడు..

 • చాలా తక్కువ రక్తపోటు
 • కాంతిహీనత
 • మూత్ర విసర్జన తక్కువగా లేదా లేదు
 • గుండె దడ
 • అవయవాలు పనిచేయకపోవడం
 • చర్మ దద్దుర్లు

(చదవండి: దంగల్‌ నటి సుహాని భట్నాగర్‌ మృతికి ఆ వ్యాధే కారణం! వెలుగులోకి షాకింగ్‌ విషయాలు!)

whatsapp channel

మరిన్ని వార్తలు