Home Remedies: వాంతికి వచ్చినట్లు ఉందా? వీటిని తిన్నారంటే వెంటనే..

29 Sep, 2021 13:34 IST|Sakshi

కడుపులో వికారంగా, వాంతికొచ్చేటట్లు ఉంటే అలసటగా అనిపిస్తుంది. ఏపని చేయడానికి శరీరం సహకరించదు. అప్పటికే ఆనారోగ్యంతో ఉంటే ఇక స్థిమితంగా ఉండలేం.. ఈ పరిస్థితి మనలో చాలా మందికీ అనుభవమే! ఐతే వంటింటి చిట్కాలతో ఏ విధంగా దీని నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చో నిపుణుల మాటల్లో మీకోసం..

పుదీనా
తాజా పుదీనా ఆకులు నమలడం ద్వారా డోకు లేదా వాంతిని నివారించవచ్చు. పుదీనా ఘాటైన రుచి కడుపులోని వికారాన్ని తొలగించి సేదతీరేలా ప్రేరేపిస్తుందని హెల్త్‌ కోచ్‌, నూట్రీషనిస్ట్‌ శిల్పా ఆరోరా సూచించారు.

అల్లం
పొట్టలోని చికాకును ఉపశమింపచేయడంలో అల్లం ఎంతో ఉపయోగపడుతుంది. దంచిన అల్లంను నీళ్లలో కలిపి తాగితే వాంతిని నివారించవచ్చని ఆయుర్వేద నిపుణులు డా. బీఎన్‌ సిన్హా తెలిపారు.

కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లలోని అధిక పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. కప్పు కొబ్బరి నీళ్లలో ఒక టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం కలిపి ప్రతి 15 నిముషాలకొకసారి తాగితే కడుపులో వికారం తొలగిపోతుందని డా. వసంత్‌ లాద్‌ రాసిన ఆయుర్వేదిక్‌ హోమ్‌ రెమెడిస్‌ అనే పుస్తకంలో పేర్కొన్నారు.

లవంగం
ఇది మన తాతముత్తాతల కాలం నుంచి చెబుతున్నదే! లవంగం మొగ్గలను నమలడం ద్వారా వాంతిని నివారించవచ్చు. లవంగం  రుచి, సువాస వికారాన్ని తొలగిస్తుంది.

సోంపు గింజలు
భోజనం తర్వాత సోంపు గింజలు నోటిలో వేసుకుంటే నోటిని తాజాగా ఉంచడమేకాకుండా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. సోంపు గింజలను నమిలినా లేదా వీటితో తయారుచేసిన టీ తాగినా కడుపులో వికారాన్ని నివారించి, వాంతికి రాకుండా అడ్డుకుంటుంది.

యాలకులు
యాలకులు కూడా వాంతిని నిరోధించడంలో సహాయపడతాయి. ఆయుర్వేదం ప్రకారం యాలకుల విత్తనాలను నమలడం వల్ల వాంతివికారాలను నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే తేనెతో కలిపి కూడా యాలకులను తినొచ్చు.

నిమ్మరసం
ఆమ్లాలను తటస్థీకరించి లేదా స్వభావం కోల్పోయేలా ప్రేరేపించి, బైకార్బొనేట్స్‌ విడుదలయ్యేలా చేయడంలో నిమ్మరసం బెస్ట్‌. బైకార్బొనేట్స్‌ వాంతివికారాలను నివారించే గుణం కలిగి ఉంటాయి. కేవలం వాంతి నుంచి ఉపశమింపచేయడమేకాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.

చదవండి: Kolkata Rasgulla: ఈ స్వీట్‌ తినడం మాత్రం మర్చిపోకండి.. అద్భుతం.!

మరిన్ని వార్తలు