ఆమెను చూస్తే..'ధైర్యే సాహసే ఆరోగ్య లక్ష్మీః' అనకతప్పదు!

1 Dec, 2023 17:01 IST|Sakshi

హాలీవుడ్‌ నటి క్యాన్సర్‌ బారిన పడింది. అది కూడా ఫోర్త్‌ స్టేజ్‌లో ఉంది. బతికే అవకాశాలు లేవు. కానీ ఆమె మాత్రం నేను చనిపోవాలని కోరుకోవడం లేదు కాబట్టి బతుకుతాను అంటూ మొండి ధైర్యంతో జయించే ప్రయత్నం చేస్తుంది. పైగే ఈ దారుణ స్థితిని కూడా ప్రయోజనకరంగా మార్చుకోవడం ఎలా అనేదానిపై దృష్టి సారిస్తుంది. ఆమె అచంచలమైన ధైర్యం తనలా అనారోగ్యంతో బాధపడేవాళ్లలో ఓ కొత్త ఊపిరిని, స్థైర్యాన్ని ఇస్తున్నాయి. ఆమె హీరోయిన్‌గా వెండి తెరపైనే కాదు బయట కూడా హీరోయినే అని ప్రూవ్‌ చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే..అమెరికా నటి షానెన్‌ డోహెర్టీ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది. అది గుర్తించే నాటికే ఫోర్ట్‌ స్టేజ్‌లో ఉంది. ప్రస్తుతం ఆ క్యాన్సర్‌ ఆమె ఎముకలంతటికి వ్యాపించి పరిస్థితి కాస్త సివియర్‌గా మారింది. ఒకరకంగా చెప్పాలంటే అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది. అయినా కూడా ఎక్కడ కించెత్తు ధైర్యాన్ని కోల్పోలేదు. ఈ స్థితిలో కూడా 'నేను చనిపోవాలని కోరుకోవడం లేదు' కాబట్టి బతుకుతా. 'నేను పూర్తిగా జీవించలేదు'. 'పూర్తిగా ప్రేమించబడ లేదు'. కాబట్టి కచ్చితంగా నా జీవితాన్ని నేను ఆస్వాదిస్తాను అని ధీమాగా చెబుతుంది.

పైగా తనలా మరెవరూ ఈ క్యాన్సర్‌తో బాధపడుకుండా ఉండేలా పరిశోధనలు మరింత విస్తృతంగా చేసేందుకు నిధులు వెచ్చిస్తుంది. అంతేకాదు ఈ క్యాన్సర్‌ నాకే ఎందుకు వచ్చింది? అది కూడా స్టేజ్‌4లోనే ఎందుకు ఉన్నా? ఇందంత ఏదో తన వల్ల అయ్యే గొప్ప ప్రయోజనం కోసమే ఇలా అయ్యి ఉంటుంది. అందుకే ఆ దిశగా నన్ను నేను బతికేలా ధైర్యం కూడగట్టకుంటూ క్యాన్సర్‌ అంతమొందించే ప్రపంచానికై తపస్సు చేస్తున్నానని నిర్భయంగా చెబుతోంది.

ఈ వ్యాధి కారణంగా నడవలేం, తినలేం కనీసం పనిచేయలేం అని ఆవేదనగా చెబుతోంది. చిన్న వయసులోనే ఎందరో ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఆ వ్యాధిని చూసి డీలా పడకుండా భిన్నమైన దృక్పథంతో మాలాంటి పేషెంట్లు ఉండి జీవితాన్ని నూతనోత్సాహంతో ఆస్వాదించాలి. అప్పుడే మళ్లీ మునుపటి జీవితాన్ని పొందగలరు అని నిరాశ నిస్ప్రుహలో ఉన్న క్యాన్సర్‌ పేషంట్లందరికి స్ఫూర్తినిచ్చేలా చెబుతోంది. నటి షానెన్‌ డోహెర్టీ 1990ల బ్లాక్‌బస్టర్‌ బెవర్లీ హిల్స్‌, 90201లో బ్రెండా వాల్ష్‌ వంటి పాత్రలతో అభిమానుల మనుసులను గెలుచుకుంది. ఈమెకు 2015లో  క్యాన్సర్‌ నిర్థారణ అయినప్పుడూ ట్రీట్‌మెంట్‌ తీసుకుని కోలుకుంది కూడా. అయితే అది మళ్లీ తిరగబెట్టి స్టేజ్‌ 4లో ఉండటమే బాధాకరం. 

(చదవండి: బిడ్డను ఎప్పుడెప్పుడూ చూస్తానా అనుకుంది! కానీ అదే ఆమెకు..)

మరిన్ని వార్తలు