ఈ విటమిన్‌ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా..

28 Oct, 2021 15:37 IST|Sakshi

రక్తహీనత, అలసట, తిమ్మిర్ల నివారణకు విటమిన్‌ బి12  ఎంతో సహాయపడుతుంది. ఇది శరీర పెరుగుదలకు, రక్త కణాల నిర్మాణంలో, నాడీ వ్యవస్థ క్రమబద్ధీకరణకు, డీఎస్‌ఏ ఉత్పత్తికి ప్రధాన పోషకం. అలాగేశరీరంలోని వివిధ భాగాల పనితీరును క్రమబద్ధీకరిస్తుంది కూడా. ఐతే ప్రపంచవ్యాప్తంగా 15% కంటే ఎక్కువ మంది ప్రజలు విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విటమిన్‌ బి 12 మన శరీరంలో సహజంగా ఉత్పత్తి కాదు. సీ ఫుడ్‌ (సముద్ర ఆధారిత ఆహారాలు), గుడ్లు, మాంస ఉత్పత్తులు, కొన్ని ప్రత్యేక పండ్లు, కూరగాయల్లో మాత్రమే ఈ విటమిన్‌ ఉంటుంది. ఏదిఏమైనప్పటికీ శాఖాహారులు ఈ విటమిన్‌ లోపంతో అధికంగా బాధపడుతున్నారు. విటమిన్ బి12 లోపిస్తే శక్తి హీనతతోపాటు కొన్ని రకాల మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

యాంగ్జైటీ
విటమిన్‌ బి12 స్థాయిలు తక్కువగా ఉంటే మానసిక సమతుల్యత దెబ్బతిని డిప్రెషన్‌కు దారితీస్తుంది. ఎందుకంటే మెదడులోని ముఖ్యమైన న్యూరోట్రాన్స్‌మిటర్ రసాయనాలైన డోపమైన్, సెరోటోనిన్ ఉత్పత్తికి విటమిన్ బి 12 బాధ్యత వహిస్తుంది.

చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి..

తిమ్మిర్లు
చేతులు, కాళ్ల వేళ్ల చివర్లు సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా విటమిన్‌ బి12 మన శరీరంలో నాడీవ్యవస్థ పనితీరులో, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇది లోపిస్తే శరీరం సమతుల్యత తప్పి కళ్లు తిరగడం, వికారం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మతిమరుపు
విటమిన్‌ బి12 లోపం​ మెదడు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. మతిమరుపు, తికమకపడటం, విషయాలను గుర్తుపెట్టుకోవడం కష్టతరమవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భాల్లో మిమిక్‌ డైమెన్షియా అనే వ్యాధి భారీనపడే అవకాశం కూడా ఉంది.

చదవండి: Science Facts: క్యాన్సర్‌ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి..

నాలుక రుచి మందగించడం
విటమిన్‌ బి12 లోపిస్తే నాలుకపై ఉండె రుచిమొగ్గలు క్రమంగా రుచిని కోల్పోతాయి. అంతేకాకుండా నాలుక వాపు, నోటి పుండ్లు, ముడతలు, నోటిలో మంట వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చు.

హృదయ సమస్యలు
గుండె వేగం పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా తలెత్తుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్‌.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తోనా..

మరిన్ని వార్తలు