రెండో కిలోలు తగ్గితే మోకాలిపై 8 కిలోల భారం తగ్గినట్టే!

20 Aug, 2021 20:42 IST|Sakshi

ఆరోగ్యం అన్నిరకాలుగా బావుండాలంటే ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. అధిక బరువు అనేక అనర్థాలకు దారితీస్తుంది. అందువల్ల  ఆహార నియమాలు పాటిస్తూ, తేలికపాటి వ్యాయామం చేసి బరువు తగ్గాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే చాలా మంది రకరకాల వ్యాయామాలు ప్రయత్నించి బరువుతగ్గలేదని బాధపడుతుంటారు. ఇలాంటివారు తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవడం, మితంగా తినడం, క్రమంతప్పని వ్యాయామంతో బరువును నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా ఆర్ధరైటిస్‌ను అదుపు చేయవచ్చు. 

పరిశోధనల ప్రకారం 2 కిలోల బరువు తగ్గితే మోకాలిపై 8 కిలోల భారం తగ్గుతుంది. అంటే ఒక మోస్తరు బరువు తగ్గినా ఆర్ధరైటిస్‌ అడ్డుకోవడంలో చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నొప్పులున్నాయి కదా అని శరీరం కదల్చకుండా ఉంచడం తప్పంటున్నారు. వాకింగ్, స్విమ్మింగ్‌ లాంటివి ఆర్ధరైటిస్‌ నొప్పుల నివారణలో కీలకపాత్ర పోషిస్తాయి. అలాగే ఇలాంటి చర్యలు జాయింట్‌ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తాయి. కనీసం వారానికి 150 నిమిషాలు నడవడం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. కేవలం ఆర్ధరైటిస్‌ నివారణకే కాకుండా కేలరీస్‌ను మధ్యస్థంగా కరిగించడంతో హృదయ కండరాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
చదవండి: కాలు కదిపితే  కీలు నొప్పి.. ఆర్ధరైటిస్‌ను ఇలా అదుపు చేద్దాం!

మరిన్ని వార్తలు