మీకేమైనా తెలుసా... వాట్స్‌  మై నేమ్‌?

15 Oct, 2021 11:30 IST|Sakshi

బాబిడోస్‌ సింగర్‌ రిహాన  రైటర్, నటి, ఫ్యాషన్‌ డిజైనర్‌ కూడా. ‘మ్యూజిక్‌ ఆఫ్‌ ది సన్‌’ ఆల్బమ్‌ ఆమెను లోకానికి పరిచయం చేసింది. ‘ఏ గర్ల్‌ లైక్‌ మీ’ రిహానను బిల్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో నిలిపింది. ‘గుడ్‌ గర్ల్‌ గాన్‌ బ్యాడ్‌’ ఆమెకు ఎంతో మంది అభిమానులను సంపాదించింది. ‘అంబ్రెల్ల’ పాట ‘గ్రామీ అవార్డ్‌’ను తెచ్చిపెట్టింది. మీరు ఏ కాస్త తీరిగ్గా ఉన్నా....‘వాట్స్‌ మై నేమ్‌’ పాటను అందుకోండి...‘యూ ఆర్‌ సో అమేజింగ్‌’ అని, ‘వుయ్‌ ఫౌండ్‌ లవ్‌’ పాటను ‘వుయ్‌ ఫౌండ్‌ లవ్‌ ఇన్‌ ఏ హోప్‌లెస్‌ ప్లేస్‌ ఎల్లో డైమండ్‌ ఇన్‌ది లైట్‌’ అంటూ బేషుగ్గా పాడుకోవచ్చు. ‘రిచెస్ట్‌ ఫిమేల్‌ మ్యూజిషియన్‌ ఆన్‌ ది ప్లానెట్‌’గా ఘనత సాధించిన రిహాన సెల్ఫ్‌–మేడ్‌ ఆర్టిస్ట్‌. రిహాన ‘రిచెస్ట్‌’ కావడానికి మ్యూజిక్‌ మాత్రమే కారణం కాదు...ఆమె మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌ కూడా.

చదవండి: పదేళ్ల బాలుడికి అంతర్జాతీయ యంగ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ అవార్డు..!!

మరిన్ని వార్తలు