Skin Friendly Socks: సాక్స్‌ అలా ఉంటే చాలా ప్రమాదకరం.. ఏం జరుగుతుందో తెలుసా..?

16 Jan, 2022 17:09 IST|Sakshi

పాదరక్షలు ఫుల్‌ షూస్, హాఫ్‌ షూ, బెల్ట్‌ షూ, పీప్‌ టోస్, వెడ్జెస్, శాండల్స్‌... ఏ రకమైనా సరే సాక్స్‌ ధరించడం కామన్‌. సాక్స్‌ చాలా మందికి డైలీ రొటీన్‌లో భాగమైపోయాయి కూడా. అయితే సాక్స్‌ ఎంపికలో మనకు తెలియకుండానే జరిగిపోయే పొరపాట్లు అనేకం. సాక్స్‌ అంటే సెకండ్‌ స్కిన్‌ అని చెప్పాలి. ఎక్కువసేపు పాదాలను అంటిపెట్టుకునే ఉంటాయి. అందుకే అవి స్కిన్‌ ఫ్రెండ్లీగా ఉండాలి. సాక్స్‌ వదులుగా జారిపోతూ ఉంటే వెంటనే స్పందిస్తాం. సాక్స్‌ బిగుతుగా ఉంటే ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలంలో కానీ బయటపడవు. ఆ క్షణంలో తెలియదు కాబట్టి మనం ఏ మాత్రం పట్టించుకోం.

చదవండి: సంక్రాంతికి వీటిని తినే ఉంటారు.. అయితే వాటి లాభాలు కూడా తెలుసుకోండి!

పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంటాం. సాక్స్‌ మరీ టైట్‌గా ఉంటే పాదం, వేళ్ల కదలికలు తగ్గిపోతాయి. అది రక్తప్రసరణ మీద ప్రభావం చూపిస్తుంది. కండరాల కదలికలు, రక్తప్రసరణ వేగం తగ్గిపోతూ ఉంటే చర్మం కూడా జీవం కోల్పోతుంటుంది. అందుకే సాక్స్‌ కాలివేళ్ల కదలికలను నియంత్రించకూడదు. సాక్స్‌ ధరించిన తర్వాత వేళ్లను సులువుగా కదిలించగలిగేటట్లు ఉండాలి. రకరకాల ప్రయత్నాల తర్వాత ఏదైనా ఒక కంపెనీ సాక్స్‌ సౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తే ఇక ఆ బ్రాండ్‌నే కొనసాగించడం మంచిది. ఇక పిల్లల విషయానికి వస్తే... పిల్లలకు ఉదయం స్కూలుకు వెళ్లేటప్పుడు వేసిన సాక్స్‌ సాయంత్రం ఇంటికి వచ్చేవరకు అలాగే ఉంటాయి.

కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్స్‌ బిగుతుగా ఉండకూడదు. అలాగే సాక్స్‌ పాతవైపోయి వదులై జారిపోతున్నప్పుడు ‘ఆదివారం సెలవు రోజు వెళ్లి కొత్తవి కొందాం’ అనుకుని ఆపద్ధర్మంగా ఒక రబ్బర్‌ బ్యాండ్‌ వేయడం జరుగుతుంటుంది. అలా రబ్బర్‌ బ్యాండ్‌తోనే రోజులు గడిపేస్తుంటారు. అది చాలా ప్రమాదం. తాత్కాలికంగా ఒకటి –రెండు రోజులు వేసే రబ్బర్‌ బ్యాండ్‌ కూడా పిల్లల కాళ్ల మీద ఒత్తిడి పడి చర్మం ఎర్రబడేటట్లు ఉండకూడదు. రక్తప్రసరణకు ఆటంకం కలిగించని విధంగా ఉండాలి. ఇంతకంటే తక్షణం కొత్త సాక్స్‌ కొనడమే ఉత్తమం.

మరిన్ని వార్తలు