టీనేజర్స్‌ మానసిక ఆరోగ్యంపై సోషల్‌ మీడియా బ్యాడ్‌ ఎఫెక్ట్‌..!

15 Oct, 2021 10:01 IST|Sakshi

‘అతి చేస్తే గతి తప్పుతుంది’ అని పెద్దలు ఊరికే అనరు..! ఏదైనా మితంగానే ఉండాలి. టీనేజర్స్‌ మానసిక ఆరోగ్యంపై సోషల్‌ మీడియా ప్రతికూల ప్రభావం చూపతుందని రకరకాల అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు టీనేజర్స్‌ అతుక్కుపోతున్నారని, దీని వల్ల నష్టం జరుగుతుందనే మాట వినబడుతుంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. హానికరమైన కంటెంట్‌ నుంచి టీనేజర్స్‌ను దూరంగా పెట్టే చర్యలు చేపట్టనుంది. ఉదాహరణకు ఒక టీనేజర్‌ అదేపనిగా ఏదైనా కంటెంట్‌ చూస్తున్నాడనుకుందాం, అట్టి కంటెంట్‌ హానికరమైనదైతే దాన్ని బ్లాక్‌ చేస్తుంది. అదేపనిగా ఇన్‌స్టాగ్రామ్‌ను యూజ్‌ చేస్తుంటే ఇక చాలు... టేక్‌ ఏ బ్రేక్‌ అని హెచ్చరిస్తుంది. ఇంకా పూర్తి వివరాలు బయటికి రాలేదు. ఇవి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఫేస్‌బుక్‌కు కూడా వర్తిస్తాయా? అనేది ఇంకా తెలియదు. 

చదవండి: ఛీ! యాక్‌!! మూడేళ్లగా పచ్చిమాంసం మాత్రమే తింటున్నాడు.. ఒక్క రోజు కూడా..

మరిన్ని వార్తలు