సాఫ్ట్‌ అండ్‌ హెల్తీ.. మొలకల డోక్లా, సింపుల్‌గా ఇలా చేసుకోండి

19 Aug, 2023 13:19 IST|Sakshi

మొలకల డోక్లా తయారికి కావల్సినవి: 

శనగ మొలకలు – కప్పు; పాలకూర తరుగు – అరకప్పు;
శనగపిండి –రెండు టేబుల్‌ స్పూన్లు; రాక్‌సాల్ట్‌ – టీస్పూను;
నూనె – టేబుల్‌ స్పూను; నువ్వులు – టీస్పూను ;
ఇంగువ – అరటీస్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు.

తయారీ విధానమిలా:
మొలకలు, పాలకూరను మిక్సీజార్‌లో వేసి కొద్దిగా నీళ్లుపోసి గ్రైండ్‌ చేయాలి.
► గ్రైండ్‌ అయిన మిశ్రమాన్ని గిన్నెలో తీసుకుని..శనగపిండి, రాక్‌ సాల్ట్‌ వేసి కలపాలి.
► ఈ మిశ్రమాన్ని ప్లేటులో పోసి ఆవిరి మీద పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
► బాణలిలో నూనెవేసి కాగిన తరువాత నువ్వులు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి.
► ఇప్పుడు ఉడికిన డోక్లాపై ఈ తాలింపుని వేసి, నచ్చిన ఆకారంలో ముక్కలు కోసి సర్వ్‌ చేసుకోవాలి.

మరిన్ని వార్తలు