నవజాత శిశువులకు తేనె ఇవ్వకూడదా? సోనమ్‌ కపూర్ సైతం..

3 Oct, 2023 12:31 IST|Sakshi

అప్పుడే పుట్టిన పిల్లలకు కొందరు తేనె పెడుతుంటారు. మాటలు తెనె పలుకుల్లా ఉంటాయని మన పెద్దవాళ్ల ఆలోచన. చెప్పాలంటే తరతరాలుగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా మన పెద్దలు అప్పుడే పుట్టిన పిల్లలకు తేనె పెడుతుంటారు. ఇలా పెట్టడంతో పిల్లలు చనిపోయిను ఉదంతాలు కూడా ఉన్నాయి. ఐతే అసలు తేనె పిల్లలకు పెట్టొచ్చా? ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధా గుణాలు కలిగిన తేనె చిన్నారుల పాలిట విషమా? తదితరాల గురించే ఈ కథనం.

ఏదీఏమైనా అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు తేనె అస్సలు పెట్టొదనే అంటున్నారు ఆరోగ్య నిపుణలు. బాలీవుడ్‌ నటి, అనిల్‌ కపూర్‌ కూతురు సోనమ్‌ కపూర్‌ సైతం ఇదే చెబుతుంది. ఎన్నో ఏళ్లుగా ఇలా చేసినప్పటికీ నిర్మొహమాటంగా మీ ముక్కు పచ్చలారని చిన్నారులకు తేనెను ఇవ్వనని గట్టిగా చెప్పండి అని అంటోంది సోనమ్‌. అది వారి ప్రాణాలను హరించే విషం అంటూ హితవు పలుకుతుంది. తాను కూడా తన కొడుకు వాయు కపూర్‌కి ఇవ్వలేదని. ఇది మన ఆచారమే అయినా..దాన్ని తను స్కిప్‌ చేశానని. అలాగే మీరు కూడా చేయండి అని సోషల్‌ మీడియా వేదికగా చెబుతుంది. అప్పుడే పుట్టిన శిశువుల్లో పూర్తిస్థాయి జీర్ణవ్యవస్థ ఉండదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రాణాంతకం కూడా కావచ్చు. దయచేసి ఇలాంటి పనులు మానుకుండి. కోరి కోరి గర్భశోకాన్ని అనుభవించొద్దు ఓ తల్లిగా చెబుతున్నా అని సోనమ్‌  స్ట్రాంగ్‌గా వార్నింగ్‌ ఇస్తోంది. 

శిశువులకు తేనె ఎందుకు సురకక్షితం కాదంటే...
శిశువులకు తేనె ఎందుకు సురక్షితం కాదని తెలుసుకోవడానికి తాను ఆరోగ్య నిపుణులను కూడా సంప్రదించినట్లు తెలిపింది సోనమ్‌. అంతేగాదు ఆమె శిశువులకు తేనె ఎందుకు ఇవ్వకూడదో వివరిస్తూ, సికె బిర్లా హాస్పిటల్ గురుగ్రామ్‌లోని నియోనాటాలజీ అండ్‌ పీడియాట్రిక్స్ డాక్టర్ శ్రేయా దూబే చెప్పిన విషయాలను కూడా పంచుకుంది. తేనెలో క్లోస్ట్రిడియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువుల ప్రేగులలో విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదికాస్త శిశు బోటులిజం అనే తీవ్రమైన వ్యాధికి దారితీస్తుంది. ఈ బొటులిజంలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో.. ఒకటి ఆహారం ద్వారా వచ్చేవి, రెండు గాయం ద్వారా వచ్చే శిశు బొటులిజం. ఈ బ్యాక్టీరియా శిశువుల నరాలపై దాడి చేసి ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది.  అందువల్ల, తేనెనూ ఏ విధంగానూ శిశువులకు తినిపించకపోవడమే మంచిదిని సోనమ్‌ గట్టిగా నొక్కి చెబుతోంది. 

వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం తేనెలో "క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే తక్కువ ఆక్సిజన్ పరిస్థితులలో ప్రమాదకరమైన టాక్సిన్‌లను (బోటులినమ్ టాక్సిన్స్) ఉత్పత్తి చేసే బాక్టీరియం ఉంటుందని పేర్కొంది. శిశు వైద్యురాలు డాక్టర్‌ మీనా జే మాట్లాడుతూ..వడకట్టలేని లేదా ప్రాసెస్‌ చేయని తేనె శిశువులకు ఇవ్వడం వల్ల న్యూరోటాక్సిసిటీకి గురై కండరాల పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది శిశువుని మరణం అంచులదాక తీసుకువెళ్తుందని తెలిపారు. తొలుత మలబద్దకం, హైసోటోనియాతో మొదలవుతుంది. క్రమేణ పక్షవాతానికి దారితీసి శ్వాస తీసుకోలేని స్థితికి చేరుకుంటారు.

చివరికి మరణం సంభవిస్తుందని చెబుతున్నారు. అలాగే హైదరాబాద్‌లోని యశోద ఆస్పతత్రిలోని శిశు వైద్యుడు డాక్టర్‌ సురేష్‌ కుమార్‌ పానుగంటి మాట్లాడుతూ.. తేనె వల్ల శిశు బొటులిజంకి గురవ్వుతారని అన్నారు. దీనివల్ల కండరాల బలహీనతకు దారితీసి కనీసం పాలను కూడా ఫీడ్‌ చేయలేనంత బలహీనంగా మారిపోయి విరేచనలు అయ్యే అవకాశం ఉందని అన్నారు. నవజాత శిశువుల్లో అప్పుడే రోగ నిరోధక వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. దీని ఫలితంగా మనం ఆచారం పేరుతో శిశువులకు తేనెను ఇచ్చేస్తాం. వారి ప్రేగుల్లో తేనెలో ఉన్న టాక్సిన్స్‌తో పోరాడే రక్షణ పూర్తిగా ఉండదు. జీర్ణసమస్యలు ఏర్పడి వివిధ అనారోగ్య సమస్యలకు దారితీసస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఏడాదిలోపు చిన్నారులకు తేనె ఇవ్వకపోవడమే మంచిదని సూచిస్తున్నారు డాక్టర్‌ సురేష్‌ కుమార్‌ పానుగంటి. ఇక ఇండియన్‌ పీడియాట్రిక్‌ ప్రకారం అప్పుడే పుట్టిన శిశువులకు జంతువులకు సంబంధించిన పాలు, పాల పొడి, టీ, నీరు, గ్లూకోజ్‌ నీరు లేదా ఇతర ఏ ద్రవాలు ఆహారంగా వ్వకూడదని హానికరం అని పేర్కొంది. ప్రజలు తేనెని శిశువులోని ప్రేగు కార్యకలాపాలను ఉత్తేజపరిచి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుందని భావిస్తారు. వాస్తవానికి తేనె శరీరంలో చాలా నీటిని తీసుకుంటుంది. ఫలితంగా వదులుగా ఉండే మలం వస్తుంది .కానీ అప్పుడే ఉండే శిశువు శరీరంలో ఆ స్థాయిలో నీరు ఉండదు, పైగా అరిగించుకునేంత జీర్ణవ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో ఉండదు.

అందువల్ల ఇలాంటి ఆచారాన్ని మానుకోవాలని డాక్టర్‌ అమిత్‌ గుప్తా చెబుతున్నారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో నవజాత శిశువుల తొలి ఆహారంగా ఆవుపాలు లేదా తేనె వంటివి ఇస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పుని గట్టిగా నొక్కి చెబుతున్నారు. తల్లిపాలు తప్ప మిగతావన్నీ శిశువుకు లేనిపోని ఆరోగ్య సమస్యలను కలిగించేవేనని అధ్యయనంలో వెల్లడైంది. కావునా మనం ఆ సంస్కృతులు, ఆచారాలు అనేవి ఆయా పరిస్థితులు దృష్ట్యా వచ్చినవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు అంతటి స్థాయిలో లేవు అనేదాన్ని కూడా మనం గమనించి విచక్షణతో వ్యవహరించాల్సి ఉంది.

(చదవండి: ఆరోగ్యం గురించి.. ఆనాడే గాంధీ పుస్తకం రాసి మరీ..)

మరిన్ని వార్తలు