అదో మురికివాడ.. కానీ చాలా ప్రత్యేకం!

1 May, 2022 18:44 IST|Sakshi

సాధారణంగా నిరుపేదలు ఎక్కువగా జీవించే ప్రదేశాలను మురికివాడలు అంటాం. నీటి ప్రవాహం, పారిశుధ్య వ్యవస్థ, కనీసం మౌలిక సదుపాయాలు లేని మురికి వాడల్ని చాలానే చూసుకుంటాం. కానీ బ్రెజిల్‌లోని రియోలో ‘శాంటా మర్ట ఫావెల’ అనే మురికివాడ చాలా ప్రత్యేకం. అత్యంత ఏటవాలైన, అందమైన మురికివాడ ఇది. అక్కడ ప్రజల్లో నైతికతను పెంపొందించేందుకు, అంటువ్యాధులను ఎదుర్కోవడానికి  స్లమ్‌ పెయింటింగ్స్‌ అనే వినూత్న ప్రయోగమే.. ఈ మురికి వాడని ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేసింది.

నిత్యం రద్దీగా ఉండే, మురికి భవనాలను రంగుల కాన్వాస్‌గా మార్చి చూపించింది.ఇక్కడే మైకేల్‌ జాక్సన్‌ ప్రసిద్ధిగాంచిన ‘దే డోంట్‌ కేర్‌ అబౌట్‌ అస్‌’ పాట చిత్రీకరణ చేశారు. దానికి గుర్తుగా అక్కడ స్థానికులు  మైకేల్‌ జాక్సన్‌ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నారు.

చదవండి: Cracked Heels Remedy: కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా.. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి.


 

మరిన్ని వార్తలు