శ్రీదేవి కూతురు

26 Aug, 2020 00:02 IST|Sakshi

ట్రోలర్స్‌ మహా కర్కశంగా ఉంటారు. శ్రీదేవి కూతురు కాబట్టి జాహ్నవి కూడా తన ఫస్ట్‌ మూవీలోనే తల్లి లెవల్‌లో అద్భుతంగా నటించాలని కోరుకుంటారు. ఒకవేళ అద్భుతం గా నటిస్తే అత్యద్భుతంగా ఏమీ లేదని పెదవి విరుస్తారు. ఇప్పుడు ‘గుంజన్‌ సక్సేనా’ చిత్రంతో కొంత శాంతించారు. తల్లితో పోలిక తేలేదు. జాహ్నవి బాగా చేసింది అంటున్నారు. ఈ సినిమాలో ఎయిర్‌ ఫోర్స్‌ పైలెట్‌ గా తనేమిటో నిరూపించుకున్న జాహ్నవి, నటిగా తనేమిటో కూడా ఇదే సినిమాతో చూపించింది. తల్లి బతికి ఉంటే జాహ్నవి బుగ్గలు పుణికి ఉండేదే.

జాహ్నవికి ఇది రెండో సినిమా. మొదటి చిత్రం ‘ధడక్‌’. కమర్షియల్‌ హిట్‌. అయితే ట్రోలర్స్‌కి అందులో జాహ్నవి నటన నచ్చలేదు. ‘ఈ సినిమాను చూడ్డానికి మీ అమ్మ లేకపోవడం మంచిదయింది’ అని ట్రోల్‌ చేశారు. అప్పటికి బాధపడేంతగా పెద్దది కాలేదు జాహ్నవి. 21 ఏళ్లు. ఇప్పుడు గుంజన్‌ సక్సేనాకు వస్తున్న కాంప్లిమెంట్స్‌ జాహ్నవికి ధడక్‌ విమర్శలను గుర్తు చేస్తున్నాయి. ‘నన్ను నేను మెరుగుపరచుకోడానికి విమర్శలు ఒక అవకాశం..‘ అంటూ నవ్వుతోంది. ఈ మాట అంటోందీ అంటే పెద్ద పిల్ల అయిందనే! ధడక్‌ తర్వాత, గుంజన్‌కు ముందు.. మధ్యలో ‘ఘోస్ట్‌ స్టోరీస్‌’, ‘అంగ్రేజీ మీడియం’లలో కనిపించింది జాహ్నవి. మరో రెండు.. ‘రూహీ అఫ్జానా’, ‘దోస్తానా 2’ ప్రస్తుతం మేకింగ్‌ లో ఉన్నాయి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు