శ్రీ కాళహస్తీశ్వర శతకం

17 Dec, 2020 06:47 IST|Sakshi

ధూర్జటి కవి విరచిత

పద్యం 6         
 స్వామిద్రోహము చేసి, వేరొకని        
గొల్వంబోతినో, కాక  నే ––                       
––నీమాట న్విన నొల్లకుండితినొ
నిన్నే దిక్కుగా జూడనో!  –––       
ఏమీ యిట్టి వధాపరాధినగు       
నన్నున్‌ దుఃఖవారాశి  వీ ––             
చీ మధ్యంబున ముంచియుంప
––దగునా శ్రీ కాళహస్తీశ్వరా !  
   
      
 భావం: శ్రీ కాళహస్తీశ్వరా! నా యజమానివైన నిన్ను, నేను ద్రోహం చేసి, మరొకరిని సేవించడానికి పోయానా? నేను నీ మాట  వినడం మానేశానా? నువ్వే దిక్కని నేను భావించలేదా? ఏ తప్పూ చేయని నన్ను నీవు దుఃఖసముద్రపు కెరటాల మధ్య ముంచివేయడం భావ్యమా? 

పద్యం  7           
దివిజక్ష్మారుహ ధేను రత్నఘన   
–భూతిన్‌ ప్రస్ఫురద్రత్న  సా ––              
–నువు నీ విల్లు నిధీశ్వరుండు       
సఖు  డర్ణోరాశి కన్యావిభుం ––           
––డు  విశేషార్చకు  డింక నీకెన    
ఘనుండున్‌  గల్గునే నీవు చూ–
చి  విచారింపవు  లేమి నెవ్వ     
–డుడుపున్‌ శ్రీకాళహస్తీశ్వరా !

భావం: శ్రీ కాళహస్తీశ్వరా! కల్పవృక్షం, కామధేనువు, అను గొప్పసంపదలతో అలరే మేరుపర్వతం నీ విల్లు. సంపదలకు అధిపతియైన కుబేరుడు నీ మిత్రుడు. సముద్రునికి అల్లుడైన శ్రీ విష్ణువు నీకు విశేషార్చకుడు. నీకు సాటి ఎవరు? పరమేశ్వరుడవైన నీవు దయతలచకుంటే  మా  పేదరికాన్ని ఎవరు తొలగిస్తారు ?       
తెలుగు తాత్పర్యం: టేకి వీరబ్రహ్మం

మరిన్ని వార్తలు