Protein Laddu- Aval Puttu: కన్నయ్యకు ఇష్టమైన వెన్న, అటుకులతో ప్రొటిన్‌ లడ్డు, అవల్‌ పుట్టు!

19 Aug, 2022 09:53 IST|Sakshi
ప్రొటిన్‌ లడ్డు- అవల్‌ పుట్టు

Srikrishna Janmashtami 2022- Protein Laddu- Aval Puttu Recipes: శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కృష్ణునికి ప్రియమైన అటుకులు, నెయ్యితో విభిన్న రకాల నైవేద్యాలను సమర్పిద్దాం... రుచులను ఆస్వాదిద్దాం..

ప్రోటీన్‌ లడ్డు 
కావలసినవి:
వెన్న – టేబుల్‌ స్పూను
జీడిపప్పు పలుకులు – మూడు టేబుల్‌ స్పూన్లు
కిస్‌మిస్‌ – మూడు టేబుల్‌ స్పూన్లు
పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు
బెల్లం తరుగు – అరకప్పు
అటుకులు – రెండు కప్పులు
యాలకులు – ఆరు.

తయారీ:
జీడిపప్పు, కిస్‌మిస్‌లను వెన్నలో వేయించాలి.
ఇవి వేగిన తరువాత కొబ్బరి తురుము వేసి దోరగా వేయించాలి
కొబ్బరి కూడా వేగాక బెల్లం వేయాలి
మరో బాణలిలో అటుకులను దోరగా వేయించి, యాలకులు వేసి మిక్సీజార్‌ లో పొడిచేసి పెట్టుకోవాలి
బెల్లం కరిగిన తరువాత అటుకుల పొడి వేసి చక్కగా కలుపుకుని లడ్డులా చుట్టుకుంటే ప్రోటీన్‌ లడ్డు రెడీ. 

అవల్‌ పుట్టు
కావలసినవి:
అటుకులు – అరకప్పు
బెల్లం – అరకప్పు
పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు
జీడిపప్పు పలుకులు – ఆరు
యాలకుల పొడి – పావు టీస్పూను
నెయ్యి – రెండు టీస్పూన్లు
ఉప్పు – చిటికెడు.

తయారీ:
అటుకులను మూడు నిమిషాలపాటు రంగు మారకుండా దోరగా వేయించుకుని, చల్లారాక మిక్సీ జార్‌లో వేసి రవ్వలా గ్రైండ్‌ చేయాలి
రవ్వను వెడల్పాటి పాత్రలో పోసుకుని, చిటికెడు ఉప్పు వేసి కలపాలి.
దీనిలో కొద్దికొద్దిగా వేడి నీళ్లు చల్లుతూ కలుపుకోవాలి.
రవ్వ మరీ మెత్తగా కాకుండా గుప్పెట్లో పట్టుకుని వత్తితే ఉండయ్యేంత మెత్తగా కలిపి పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

టీస్పూను నెయ్యిలో జీడిపప్పుని బంగారు వర్ణంలోకి మారేంత వరకు వేయించి పక్కనపెట్టుకోవాలి
ఇప్పుడు మందపాటి పాత్రలో బెల్లం, పావు కప్పు నీళ్లుపోసి మరిగించాలి.

బెల్లం కరిగిన వెంటనే ద్రావణాన్ని వడగట్టాలి ∙వడగట్టిన ద్రావణాన్ని ఉండపాకం రానివ్వాలి.
పాకం రాగానే స్టవ్‌ ఆపేసి.. తడిపిపెట్టుకున్న అటుకుల రవ్వ వేసి తిప్పాలి
రవ్వను చక్కగా కలుపుకున్న తరువాత జీడిపప్పు, కొబ్బరి తురుము, మిగిలిన నెయ్యి వేసి అందంగా గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి.  

ఇవి కూడా ట్రే చేయండి: Bread Jamun Recipe: బ్రెడ్‌ జామూన్‌ ఇంట్లోనే తయారు చేసుకోండిలా!
దాల్‌ బనానా ఖీర్‌, కలాకండ్‌ లడ్డూ తయారీ ఇలా!

మరిన్ని వార్తలు