ఆధ్యాత్మిక సేవలో తమన్నా: ట్రెడిషనల్‌ లుక్‌ పిక్స్‌ వైరల్‌

25 Jan, 2024 13:34 IST|Sakshi

#TamannabhatiavisitsKamakhyaTemple సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తన సత్తాను చాటుకున్న తమన్నా భాటియా  ప్రస్తుతం ఆధ్యాత్మిక పర్యటనలు, సేవపై  దృష్టిపెట్టినట్టు  కనిపిస్తోంది. అందం, ఆకర్షణతో మిల్కీ బ్యూటీగా పాపులర్‌ అయిన తమన్నా పర్సనల్‌ లైఫ్‌కి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. రెండు రోజుల క్రితం రామమందిర ప్రాణ ప్రతిష్ట వేడుకల్లో   పాల్గొన్న  తమన్నా కుటుంబ సమేతంగా కామాఖ్య ఆలయానికి వెళ్లింది. 

తాజాగా తల్లి దండ్రులతో కలిసి తమన్నా గౌహతిలోని ప్రఖ్యాత కామఖ్య ఆలయాన్ని సందర్శించింది. ప్రత్యేకంగా పూజలు నిర్వహించి. మాతా రాణి ఆశీస్సులు తీసుకుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.. ఈ సందర్భంగా తమన్నా లుక్‌, గెటప్‌  చూసి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

పసుపు కాషాయ రంగు మేళవింపుతో కూడిన సాంప్రదాయ  దుస్తులు, నుదుటిన తిలకం, మెడలో పూమాల,  దేవుడి శాలువ ఇలా ప్రత్యేకంగాట్రెడిషనల్‌ లుక్‌లో అదరగొట్టేస్తోంది. శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవాలయం నీలాచల్ కొండపై ఉంది.


 

whatsapp channel

మరిన్ని వార్తలు